అక్కినేని నాగార్జున.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన డేరింగ్‌నెస్ చెప్పడానికి ఎలాంటి మొహమాటమూ అక్కర్లేదు. ఇండస్ట్రీలో 39 ఏళ్లుగా వివిధ రకాల పాత్రలు, బాధ్యతలతో కింగ్‌లా అదరగొడుతున్నారు. ఇతర హీరోల్లా ఒకే విభాగం మీద దృష్టి పెట్టకుండా ఇటు నటన.. అటు నిర్మాణం చూసుకుంటూ వస్తున్నారు. అలాంటాయన పుట్టిన రోజు సందర్భంగా మరోసారి ఆయన ఘనతలు, డేరింగ్ స్టెప్పుల గురించి మాట్లాడుకోవడం సబబే కదా. అందుకే ఈ ప్రయత్నం. ఇందులోని కొన్ని విషయాలు మీకు తెలిసే ఉంటాయి. వాటిని గుర్తు చేస్తున్నాం అనుకోండి. తెలియని వాటిని చదివి వావ్ అనుకోండి.
* తొలి సినిమా (విక్రమ్) ఏదో అలా చేసేశాను.. ఏఎన్నార్ కొడుకు సినిమా అని చూసేశారు అని ధైర్యంగా చెప్పాడు నాగ్. ఎంతమంది ఇలా అనగలరు.
* ఆఖరి పోరాటం సినిమాలో ఓ బొమ్మలా ఉన్నానంతే. సినిమా ఘనత అంతా దర్శకుడు రాఘవేంద్రరావు, హీరోయిన్ శ్రీదేవిదే అని చెప్పారు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో. దీనికి చాలా ధైర్యమే కావాలి.
* హీరోగా 99 సినిమాలు చేసి.. వందో సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సమయంలో తనలోని నటుడి ఆకలిని సంతృప్తి పరచడానికి ఒక విలన్, ఒక విలన్ షేడ్ ఉన్న సినిమా చేశాడు. ఇది డేరింగ్‌కి పీక్స్ లాంటి స్టెప్.
* అగ్ర హీరో కొడుకు అయి ఉండి, వరుస విజయాలు అందుకుని కూడా.. నాతో ఓ సినిమా చేయండి ప్లీజ్ అని ప్రముఖ దర్శకుడు మణిరత్నం వెంటపడి మరీ ‘గీతాంజలి’ చేశాడు. ఇది ఆయన పట్టుదలకు ఓ మచ్చుతునక.
* తన కంటే సీనియర్ స్టార్ హీరోలు హీరోయిన్ల వెంట పడుతూ ప్రేమకథలు చేస్తుంటే నాగ్ మాత్రం రెండు కాళ్లూ పడిపోయిన వ్యక్తిగా ‘ఊపిరి’ చేశాడు. ఇలాంటి కథలు ఓకే చేయాలంటే ఆ గుండె ఎంత గట్టిది అయి ఉండాలి.
* కొత్తవాళ్ల మీద నమ్మకం పెట్టి హీరోగా ఒకటో రెండో సినిమా ఛాన్స్‌లు.. నిర్మాతగా ఒకట్రెండు ఛాన్స్‌లు ఇవ్వడం సాధారణం. కానీ నాగ్ రామ్‌గోపాల్ వర్మతో మొదలుపెట్టి ఇప్పటివరకు ఏకంగా 40 మంది దర్శకుల్ని సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు. ఇది డేరింగ్‌కే డాడీ లాంటి స్టెప్.
* కోట్ల మంది చూస్తున్న ఓ టీవీ షోలో ‘నాకు ఏమీ గుర్తుండవు అని ఒప్పుకోవడానికి.. ఇతరులు చెప్పినట్లు ఆ గుర్తొచ్చింది అని ఒప్పుకోవడం ఎంత కష్టమో మీకూ తెలుసు. అది నాగ్ చేశాడు మరి.
* ఏ స్టార్ హీరో కెరీర్‌లో అయినా అతిథి పాత్రలు చాలా తక్కువ ఉంటాయి. కానీ నాగ్ ఏంటో ఎవరు అడిగినా ఇట్టే గెస్ట్ అప్పీయరెన్స్‌కి ఓకే చెప్పేస్తాడు. క్రేజీ కదా.
* సినిమాల నిర్మాణంలోకి రావడానికి స్టార్ హీరోలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్న సమయంలో ‘యువ’ అనే టీవీ సీరియల్‌నే నిర్మించి టెలివిజన్ రంగంలో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు నాగ్.
* బిగ్‌బాస్ హోస్ట్‌గా చేయడం అంటే ట్రోలింగ్‌ని కోరుండి ఆహ్వానించడం అంటుంటారు. అలాంటిది వరుసగా ఏడుసార్లు బిగ్ బాస్ హోస్ట్ అయ్యాడు. ఇది టూమచ్ క్రేజీ ఫీట్ కాదంటారా. ఇక ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ హోస్టూ ఆయనే.
* నాగార్జున గురించి మాట్లాడుకుంటూ, ఆయన ప్రత్యేకతలు చెప్పుకుంటూ ఫిట్‌నెస్, లైఫ్ డెసిషన్స్ గురించి చెప్పకపోతే ఎలా? చిరంజీవి లాంటి హీరోనే ఫిట్‌నెస్, డెసిషన్స్ విషయంలో నాగార్జునను ఫాలో అవుతున్నా అని చెప్పారంటే పరిస్థితి మీరే అర్థం చేసుకోవచ్చు.
* బాలీవుడ్‌కి వెళ్లి చేతులు కాల్చుకుంటున్న మన హీరోలు నాగార్జున డేరింగ్ గురించి కచ్చితంగా తెలుసుకునే ఉంటారు. ఆయన ‘శివ’ నుండి మొన్నటి ‘బ్రహ్మాస్త్ర’ వరకు ఎంచుకున్న హిందీ సినిమాలు చాలా వరకు హిట్లే మరి.
* ఆయన తరం హీరోలు అందరూ డ్యాన్స్‌లు ఇరగ్గొడుతూ ముందుకెళ్తుంటే కేవలం నడక, జుట్టు సవరించడం, నవ్వడంతోనే ప్రేక్షకుల్ని మైమరిపించేశాడు.
ఇవన్నీ నాగ్ కెరీర్‌లోని కొన్ని డేర్స్ మాత్రమే. ఆయన లైఫ్‌ని మరింత క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే ఇంకా చాలా తెలుస్తాయి. ఇవన్నీ చెప్పి అసలు మాట చెప్పకపోతే ఎలా? ‘హ్యాపీ బర్త్ డే కింగ్ నాగార్జున’.
ఆస్కార్ బరిలో రజనీకాంత్ దర్శకుడి సినిమా.. ఏంటంటే?