భారీ టీఆర్పీ దక్కించుకున్న బిగ్ బాస్4 ఫస్ట్ ఎపిసోడ్!

బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ అని చెప్పాలి. 2017లో మొదలైన బిగ్ బాస్ తెలుగు సక్సెస్ఫుల్ గా మూడు సీజన్స్ పూర్తి చేసుకొని 4వ సీజన్లోకి ఎంటర్ అయ్యింది. సెలెబ్రిటీల జీవితాలు దగ్గరగా చూపించే రియాలిటీ షో మెల్లగా ప్రేక్షకులకు ఎక్కేసింది. బిగ్ బాస్ షో నిలిపివేయాలంటూ పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినా నిర్వాహకులు వెనక్కి తగ్గడం లేదు. దానికి కారణం ఈ షోకి వస్తున్న టీఆర్పీ రేటింగ్. స్టార్ మాలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ కి భారీ టీఆర్పీ దక్కుతుంది.

ఈ షో ప్రసారం అయినంత కాలం, మరో ప్రోగ్రాం ఆధిపత్యం ఉండవు. సోలోగా బుల్లితెరను ఈ ప్రోగ్రాం దున్నేసింది. కాగా సెప్టెంబర్ 6న గ్రాండ్ మొదలైన బిగ్ బాస్ సీజన్ 4 ఊహించని టీఆర్పీ దక్కించుకుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 4 ఏకంగా 18.5 టీఆర్పీ దక్కించుకుంది. ఒక టెలివిజన్ ప్రోగ్రాం ఆ స్థాయి టీఆర్పీ దక్కించుకోవడం రికార్డు అని చెప్పాలి. కింగ్ నాగార్జున తనదైన శైలిలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని పరిచయం చేయగా,

ప్రేక్షకులు ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవుతున్న లక్కీ ఫెలోస్ ఎవరని ఆసక్తిగా చూశారు. మొత్తంగా ప్రారంభ ఎపిసోడ్ భారీ టీఆర్పీ దక్కించుకొని దుమ్ము రేపింది. ఇక బిగ్ బాస్ మొదలై రెండవవారం కూడా పూర్తికానుంది. మొదటివారంలో దర్శకుడు సూర్య కిరణ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus