మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ (Peddi) ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా ఏరియాల్లో నిన్న రాత్రి నుండే ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేస్తూ వస్తున్నారు.
ఎక్కువ శాతం పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ‘పెద్ది’ సినిమా చూసి తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.
‘తాను పొల్లాచి షూటింగ్‌లో ఉన్నప్పటికీ,మనసంతా ‘పెద్ది’ సినిమా పైనే ఉందని చిరు చెప్పుకొచ్చారు. అలాగే ‘గత 2 ఏళ్ళుగా ‘పెద్ది’ పాత్ర కోసం చరణ్ తన ఆహార్యాన్ని మార్చుకుని పడిన కష్టాన్ని దగ్గరుండి చూశానని, ఇప్పుడు ‘పెద్ది’ గురించి చరణ్ నటన గురించి గొప్పగా మాట్లాడుతుంటే… వారి ప్రేమాభిమానాలు చూస్తుంటే ఒక నటుడిగా, తండ్రిగా ఎంతో గర్వంగా ఉందని’ చిరు ఆనందపడ్డారు. ‘పెద్ది’ వంటి అద్భుతమైన కథను తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబు సాన,
ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన నిర్మాత వెంకట్ సతీష్ కిలారుల..ను ప్రత్యేకంగా అభినందించారు చిరు. అంతేకాకుండ ‘పెద్ది’ లో నటించిన శివరాజ్‌కుమార్, జగపతిబాబు, హీరోయిన్ జాన్వీ కపూర్‌ల నటనను కూడా మెచ్చుకున్నారు. ఇక సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురించి మాట్లాడుతూ… ‘ ‘పెద్ది’ కి అద్భుత సంగీతం ఇచ్చారని’ కొనియాడారు. రత్నవేలు విజువల్స్ కూడా టాప్ నాచ్ లో ఉన్నాయని,
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వాములవ్వడంతో ‘పెద్ది’ రేంజ్ పెరిగిందని సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని చిరు తెలిపారు. ‘పెద్ది’ సక్సెస్ అనేది టాలీవుడ్లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని కూడా చిరు ఆశాభావం వ్యక్తం చేశారు.
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster!
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ… pic.twitter.com/gZwN99aERV
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2026