బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సారధ్యంలో యాక్షన్ సీన్స్!

అక్కినేని నాగార్జున-రాంగోపాల్ వర్మల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలై కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. నాగార్జున, అజయ్, సాయాజీ షిండేలా కాంబినేషన్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. బాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఐజా షేక్ సారధ్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ షూట్ జరుగుతోంది. ముంబైలోని ఎస్సెల్ వరల్డ్ అనే ఎమ్యూజ్ మెంట్ పార్క్ లో యాక్షన్ సీక్వెన్స్ తోపాటు ఛేజింగ్ సీన్స్ కూడా షూట్ చేస్తున్నారు. మార్చి 10 వరకూ జరగనున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించనున్నారు.

నాగార్జున తనను నమ్మి ఈ అవకాశం ఇవ్వడంతో రాంగోపాల్ వర్మ ఒళ్ళు దగ్గరపెట్టుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి “శపధం” అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. సీరియస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై లేదా ఆగస్ట్ లో విడుదలవుతుంది. ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తున్నారు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు కానీ ఒన్నాఫ్ ది హీరోయిన్ గా మాత్రం మైరాను ఆల్రెడీ మీడియాకి పరిచయం చేశాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus