నాగ‌చైత‌న్య, స‌మంత‌ల ప్రేమ పై నాగ్ స్పందించాడు!

నాగ‌చైత‌న్య, స‌మంత‌ల ప్రేమ వ్య‌వ‌హారం త్వ‌ర‌లోనే ఓ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మీడియా ముందు స‌మంత త‌న ల‌వ్ సీక్రెట్ చెప్ప‌డం, అప్ప‌టి నుంచి నాగ‌చైత‌న్య – స‌మంత‌ల చుట్టూ గాసిప్పులు పుట్టుకు రావ‌డం తెలిసిందే.

ఇప్పుడు నాగ‌చైత‌న్య ఇంట్లో వాళ్ల‌ని సైతం ఒప్పించాడ‌ని టాక్‌. దానికి తోడు నాగార్జున కూడా చైతూ పెళ్లి విష‌య‌మై త‌న మ‌న‌సులోని మాట‌ని బ‌య‌ట‌పెట్టాడు. ‘చైతూ త‌న జీవిత భాగ‌స్వామిని ఎంచుకొన్నాడు. ఈ విష‌యంలో నేనూ, అమ‌ల చాలా హ్యాపీగా ఉన్నాం. త్వ‌ర‌లోనే ఓ గుడ్ న్యూస్ చెబుతా’ అంటున్నాడు నాగార్జున‌. అది స‌మంత, చైతూల పెళ్లి విష‌య‌మే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

మ‌రోవైపు అఖిల్ ల‌వ్ మ్యాట‌ర్ కూడా రివీల్ చేసేశాడు నాగ్‌. ‘అఖిల్ నిశ్చితార్థం జ‌రిగిపోయింద‌న్న వార్త‌ల్లో నిజం లేదు. అఖిల్ కూడా ల‌వ్‌లో ఉన్నాడు. ఆ విష‌యం మాకూచెప్పాడు’ అని క్లారిటీ ఇచ్చేశాడు. సో… నాగ్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగ‌డం ఖాయ‌మ‌న్న‌మాట‌.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus