పెళ్లిళ్లు ఈ ఏడాది లేనట్టే – నాగ్

Advertisement

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తుందా లేదా..? వంటివి విషయాలు ఎంతగా చర్చనీయం అయ్యాయో అదే స్థాయిలో తెలుగు నాట చర్చకు లేవదీసింది అక్కినేని వారి పెళ్ళిసందడి. అందులోనూ ఇద్దరికీ ఒకేసారి పెళ్లి అనేసరికి అది మరింత ఉధృతమైంది. ఈ విషయంపై కొంతకాలం మౌనంగా ఉన్న నాగ్ ఇటీవల పెదవి విప్పిన సంగతి తెలిసిందే.అఖిల్ నిశ్చితార్థానికి ఖరారు చేసిన ముహుర్తాన్ని వెల్లడించారు. అయితే ఎటోచ్చి ఆది నుండి ఆసక్తిరేపిన చైతూ కథే గ్రీన్ సిగ్నల్ పడినా సెట్స్ పైకి వెళ్ళని సినిమాలా తయారైంది. దీనిపై ఇటీవల పాత్రికేయులతో ముచ్చటించిన నాగ్ చైతూ కొంత టైమ్ కావాలని అడిగాడని చెప్పారు. అయితే పెళ్లిళ్లు మాత్రం ఈ ఏడాది ఉండవని క్లారిటీ ఇచ్చారు.

ఇక సినిమా కబుర్లు విషయానికొస్తే.. నిర్మలా కాన్వెంట్ విజయంపై ధీమా వ్యక్తం చేసిన నాగ్ రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా బాగా వస్తోందని చెప్పారు. ముఖ్యంగా పతాక సన్నివేశాలు అందరినీ మెప్పిస్తాయన్నారు. సంక్రాంతి విడుదల అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా వుంటుందని,  గనక ఇప్పుడే ఒక అంచనాకి రాలేమన్నారు.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus