నాగార్జునను పోలీస్ అధికారిగా చూపించనున్న వర్మ!

వర్మ, నాగార్జున ల కాంబినేషన్ కి ఓ చరిత్ర ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ నడకకు వేగం పెంచిన “శివ” వంటి సినిమాను అందించిన ఘనత వీరిది. ఆ తర్వాత కలిసి అంతం, గోవిందా గోవిందా సినిమాలు తీశారు కానీ.. ఆశించినంత విజయం సాధించలేదు. మళ్ళీ చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత ఈ కాంబినేషన్ సెట్ అయింది. హిట్స్ లేక వివాదాస్పద కామెంట్స్ కే పరిమితమైన వర్మ కి నాగార్జున ఎలా మళ్ళీ ఛాన్స్ ఇచ్చారని కొంతమంది ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.  ఈ సినిమాలో నాగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలిసింది. వర్మ చెప్పిన పోలీస్ కథ నచ్చడంతో నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

Click Here

వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్ నాగార్జునను శివమణి చిత్రంలో డిఫెరెంట్ గా చూపించారు. ఇప్పుడు గురువు నాగార్జునను ఇంకెంత డిఫెరెంట్ గా చూపించనున్నారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 20 నుంచి మొదలుకానున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus