Nagarjuna, Akhil: ఆ మూవీకి ఘోస్ట్ ప్రొడ్యూసర్ గా నాగ్?

ఊహ తెలియని వయస్సులోనే సిసింద్రీ సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ను అఖిల్ ఖాతాలో వేసుకున్నారు. సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే పలు యాడ్లలో నటించి అఖిల్ అమ్మాయిల కలల రాకుమారుడిగా మారారు. తక్కువ సమయంలోనే అఖిల్ స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకుంటాడని అక్కినేని ఫ్యాన్స్ భావించారు. అయితే అఖిల్ ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించగా ఆ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ షూటింగ్ పూర్తైనా ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో తెలియాల్సి ఉంది. మరోవైపు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అఖిల్ హీరోగా భారీ బడ్జెట్ తో ఏజెంట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకు నాగ్ ఘోస్ట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ రిస్క్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాకు ఎక్కువ భాగం షూటింగ్ స్టూడియోలలోనే చేయాల్సి ఉండగా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ పనులు జరగనున్నాయని సమాచారం. ఇందుకోసం అయ్యే బడ్జెట్ అన్నపూర్ణ స్టూడియోస్ ఖాతాలోకే వెళుతుందని ఈ విధంగా ఏజెంట్ మూవీకి నాగ్ ఘోస్ట్ ప్రొడ్యూసర్ అవుతున్నారని సమాచారం. నాగార్జున కొడుకు సక్సెస్ కోసం తన వంతు కృషి చేస్తూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. ఈ సినిమాలో కీలక పాత్రలో మమ్ముట్టి నటించనున్నారని తెలుస్తోంది. ఏజెంట్ మూవీతో అఖిల్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తాడని అక్కినేని ఫ్యాన్స్ ధీమా వ్యకం చేస్తున్నారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus