నాగార్జునకు ఎలాంటి కథలైనా పర్‌ఫెక్ట్‌గా సెట్ అయిపోతాయి. వంద సినిమాలకు దగ్గరవుతున్న ఈ సమయంలో ఈ మాట చెప్పడం సరికాదు కూడా. అయితే ఇప్పుడు ఆయనున్న వయసు, ఇమేజ్‌కి ప్రేమకథను చేసి మెప్పించబోతున్నారు అనేదే ఇక్కడ విషయం. ఇటీవల కాలంలో వైవిధ్యమైన సినిమాలవైపు ఆలోచిస్తూ వచ్చిన నాగార్జున ఇప్పుడు క్లాసిక్ లవ్ స్టోరీని చేస్తున్నారట. అదేంటి ‘నాగార్జున చేస్తున్న సినిమా ‘నా సామిరంగా’ కదా.. అది ప్యూర్ మాస్ కదా అనుకుంటున్నారా? అవును మాసే కానీ… ప్రేమకథ ఉన్న మాస్ అట.
‘సంక్రాంతి వస్తాం’ అని చెప్పి మరీ మొదలుపెట్టిన (Naa Saami Ranga) ‘నా సామిరంగా’ సినిమా దాదాపు పూర్తయిపోయిందట. దీంతో సినిమా టీమ్ ప్రచారం షురూ చేసింది. త్వరలో ఫస్ట్ సింగిల్‌ను కూడా లాంచ్ చేస్తారట. ఈ క్రమంలో బిగ్‌బాస్ వేదికగా ఫస్ట్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. అంతేకాదు ఆ ప్రోమోలో హీరోయిన్‌ను కూడా పరిచయం చేశారు. వరలక్ష్మిగా ఆషికా కనిపించబోతోంది. అచ్చ తెలుగు అమ్మాయిలుగా ఆషికాను చూపించిన విధానం అదిరిపోయింది.
ఆ విషయం పక్కనపెడితే ఈ సినిమా గురించి నాగార్జున చెప్పిన విషయాలు ఇంకా అదిరిపోయాయి. ఈ సినిమాలో తనకు, అషికకు మధ్య చక్కటి ప్రేమకథ ఉందని, అది క్లాసిక్‌గా ఉంటుందని చెప్పారు. దీంతో నాగార్జున స్టైల్‌లో ఆ ప్రేమకథ ఎలా ఉండబోతోంది అంటూ అభిమానులు అప్పుడే అంచనాలు వేసేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకం అని, కొన్ని సన్నివేశాల్లో హీరోను డామినేట్ చేసేలా ఉంటుంది అని కూడా చెబుతున్నారు.
అలాగే హీరోయిన్ పాత్రలోని డిఫరెంట్ షేడ్స్ సినిమాను మలుపు తిప్పుతాయని కూడా నాగార్జున చెప్పారు. విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నాగార్జునకు 99వ సినిమా కావడం గమనార్హం. ఈ సినిమా అయిపోయిన వెంటనే నాగార్జున తన మైల్‌స్టోన్ 100వ సినిమా కోసం రెడీ అవుతారు. గతంలో చెప్పిన దాని ప్రకారం అయితే మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా ఉండాలి.
యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!
దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!