Mahesh Babu: ఫ్యాన్స్ ను కంగారు పెట్టిన మహేష్, సితార ల లేటెస్ట్ ఫోటోలు..!

మహేష్ బాబు, సితార కు సంబంధించిన రెండు లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలు ఒకింత కంగారు పెట్టే విధంగా ఉన్నాయని సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఫొటోల్లో సితార పై వైట్ క్లాత్ కప్పి ఉంది. అలాగే తన తండ్రి మహేష్ ను హత్తుకొని పడుకుంది. దీంతో ఆమెకు ‘ఒంట్లో బాలేదా?’ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటోలను నమ్రత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అయితే అందరికీ గుడ్ మార్నింగ్ చెబుతూ ఈ ఫోటోలను షేర్ చేసింది అంతే..!

సితార.. నాన్న కూచి కాబట్టి.. మహేష్ ను గట్టిగా హత్తుకొని పడుకుంది. కాబట్టి అభిమానులు.. కంగారు పడకండి..! ఇక సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ మొదటి షెడ్యూల్ పూర్తయింది.రెండో షెడ్యూల్ కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతి తగ్గిన వెంటనే ప్రారంభం కానుంది. మరోపక్క త్రివిక్రమ్ డైరెక్షన్లో కూడా మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ ను యుకెలో ప్రారంభించనున్నారు. ఇది మహేష్ బాబుకి 28వ చిత్రం కావడం విశేషం. ‘అతడే పార్ధు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus