స్టార్ హీరో బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకోగా అనిల్ రావిపూడి సినిమా బాలయ్య కోరుకున్న మరో విజయాన్ని అందిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య 108వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. అయితే బాలయ్య109 మూవీ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కనుంది. బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కానుంది. బాలయ్య అనిల్ కాంబో మూవీ జూన్, జులై నాటికే షూట్ పూర్తి చేసుకోనుందని సమాచారం అందుతోంది. అయితే బాలయ్య బోయపాటి శ్రీను సినిమా పూర్తైన తర్వాతే కొత్త సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. నమ్మిన వాళ్లకు బాలయ్య ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారో చెప్పడానికి ఇదే సాక్ష్యమని కామెంట్లు వినిపిస్తున్నాయి. బోయపాటి శ్రీనుతో బాలయ్య రెండు రోజుల పాటు చర్చలు జరిపారని సమాచారం.
బాలయ్య (Balakrishna) నుంచి బోయపాటి శ్రీనుకు స్పష్టమైన హామీ లభించిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. బాలయ్య బోయపాటి కాంబో మూవీ విడుదలైన తర్వాత బాలయ్య బాబీ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుంది. బాలయ్య తర్వాత సినిమాలు సైతం బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. బోయపాటి శ్రీను బాలయ్య కోసం పవర్ ఫుల్ రోల్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది.
అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా న భూతో న భవిష్యతి అనేలా ఉండబోతుందని సమాచారం అందుతోంది. బాలయ్య సినిమాల బడ్జెట్లు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి. బాలయ్య సినిమాల శాటిలైట్, డిజిటల్ హక్కులకు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది.