Nandamuri Balakrishna: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన బాలయ్య.. అసలేం జరిగిందంటే?

  • June 23, 2024 / 02:39 PM IST

స్టార్ హీరో బాలకృష్ణ (Balakrishna) ఒకవైపు సినిమా హీరోగా మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్య హిందూపురం నుంచి మరోమారు ఎమ్మెల్యేగా గెలవడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. బాలయ్య సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ 24వ వార్షికోత్సవ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ ఏపీలో కూడా త్వరలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ను ప్రారంభించనున్నామని వెల్లడించారు.

ఈ ఆస్పత్రి కోసం చంద్రబాబు గారు గతంలోనే స్థలం కేటాయించడం జరిగిందని బాలయ్య చెప్పుకొచ్చారు. బాలయ్య తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. బాలయ్య ఇదే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య బాబీ కాంబో మూవీ షూటింగ్ 50 శాతం పూర్తి కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. 2025 సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుందని సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉన్నట్టు అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. సితార నిర్మాతలు త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

బాలయ్య బాబీ (Bobby) కాంబో మూవీకి వీరమాస్ అనే టైటిల్ తో పాటు మరికొన్ని టైటిల్స్ ను పరిశీలిస్తుండగా ఈ సినిమా ఏ టైటిల్ ను ఫైనల్ చేస్తారనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది. బాలయ్య సినిమాల బడ్జెట్లు పెరగగా ఆ సినిమాలకు బిజినెస్ సైతం అదే స్థాయిలో జరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus