Chaitanya Krishna: హీరోగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చైతన్య కృష్ణ.. కానీ?

నందమూరి చైతన్యకృష్ణ (Nandamuri Chaitanya Krishna) హీరోగా కొన్ని నెలల క్రితం విడుదలైన (Breathe) బ్రీత్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ సినిమా థియేటర్లలో విడుదలైందనే సంగతి కూడా చాలామంది అభిమానులకు తెలియదు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుండగా ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. అయితే హీరోగా చైతన్యకృష్ణ మరో సినిమాకు ఓకే చెప్పారని తెలుస్తోంది.

జీకే చౌదరి అనేడైరెక్టర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఇప్పటివరకు కో డైరెక్టర్ గా పని చేసిన జీకే చౌదరి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం కానున్నారు. ధమ్, బ్రీత్ సినిమాలతో ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోని చైతన్యకృష్ణ హీరోగా సక్సెస్ కావడం సులువు అయితే కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రయత్నించడంలో తప్పేం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చైతన్యకృష్ణ సినిమాలు సొంత బ్యానర్ లోనే తెరకెక్కే ఛాన్స్ ఉంది. చైతన్యకృష్ణ ఈతరం ప్రేక్షకులకు నచ్చే కథ, కథనం ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటే కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు. (Nandamuri Balakrishna) బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సూచనలతో మంచి కథలను ఎంచుకుంటే చైతన్యకృష్ణ కెరీర్ కు మేలు జరుగుతుందని చెప్పవచ్చు. చైతన్యకృష్ణ పాలిటిక్స్ పై దృష్టి పెడితే బాగుంటుందని మరి కొందరు సూచిస్తున్నారు.

చైతన్యకృష్ణ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. చైతన్యకృష్ణ కొత్త సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది. రెండో సినిమాతో అయినా చైతన్య కృష్ణ భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని నందమూరి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చైతన్య కృష్ణ వయస్సు 49 సంవత్సరాలు కాగా ఈయన జయకృష్ణ కొడుకు అనే సంగతి తెలిసిందే. నందమూరి, నారా ఫ్యామిలీలపై విమర్శలు చేస్తే చైతన్యకృష్ణ ఘాటుగా బదులిస్తున్నారు.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus