Varun Tej , Lavanya: ఇంటికి వెళ్లి మరీ పిలిచిన పెళ్లికి హాజరుకాని హీరో?

మెగా హీరో వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి వివాహం నేడు భారత కాలమాన ప్రకారం 2:48 నిమిషాలకు ఇటలీలో ఎంతో ఘనంగా జరగబోతుంది. ఈ విధంగా వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఈ క్రమంలోనే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక వీరి పెళ్లి వేడుకలు కూడా మూడు రోజుల నుంచి ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి.

ఇప్పటికే హల్దీ మెహందీ వేడుకలలో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులను మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వానించారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలకు కూడా ఈ పెళ్లికి ఆహ్వానం అందిందని తెలుస్తుంది. ఇప్పటికే నితిన్ ఫ్యామిలీతో కలిసి ఇటలీలోని వరుణ్ తేజ్ (Varun Tej) పెళ్లి వేడుకలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.

ఇక గత కొంతకాలంగా మెగా కుటుంబంతో చాలా చనువుగా ఉన్నటువంటి నందమూరి కుటుంబ సభ్యులకు కూడా స్వయంగా ఇంటికి వెళ్లి మరి పెళ్లికి ఆహ్వానం అందజేశారట. బాలకృష్ణ ప్రస్తుతం సినిమా రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈయన పెళ్లికి హాజరు కాలేకపోయారు. అయితే మరొక హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కూడా ఇంటికి వెళ్లి మరి పెళ్లికి రావాలని ఆహ్వానం అందజేసినప్పటికీ ఈయన హాజరు కాలేదని తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ను వివాహానికి ఆహ్వానించిన సమయంలో తాను రాలేకపోతున్నానని కూడా చెప్పారట అయితే ఈ విషయం తెలియక చాలామంది వరుణ్ పెళ్లికి వెళ్లడం ఎన్టీఆర్ కు ఇష్టం లేదు అంటూ వార్తలను ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని కేవలం సినిమా షూటింగ్ కారణంగానే వెళ్లలేకపోయారని తెలుస్తుంది. ఇలా పెళ్లికి వెళ్లలేకపోయినా హైదరాబాదులో జరగబోయే రిసెప్షన్ కి మాత్రం టాలీవుడ్ సెలబ్రిటీలందరూ హాజరు కాబోతున్నారని తెలుస్తుంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus