Kalyan Ram: జూనియర్ ఎన్టీఆర్ అలా ఫీలవుతాడు.. కళ్యాణ్ రామ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ బ్యానర్లలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కూడా ఒకటి అనే సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ లో ఇప్పటివరకు పది సినిమాలు తెరకెక్కగా మూడు సినిమాలు మినహా మిగతా సినిమాలన్నీ మంచి ఫలితాలను అందుకున్నాయి. అయితే ఈ బ్యానర్ గురించి తాజాగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కు నేను నిర్మాతను కాదని మరో విధంగా చెప్పాలంటే అది తారక్ బ్యానర్ అని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కు నేను నిర్మాతగా వచ్చి కుర్చీలో కూర్చుని అన్ని విషయాలు తెలుసుకోవడం చేయనని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. జై లవకుశ షూట్ టైమ్ లో నేను రెండు మూడు రోజులు మాత్రమే సెట్ కు వెళ్లానని ఎందుకు రావడం లేదని తారక్ అడగగా అది నీ బ్యానర్ అని చెప్పానని కళ్యాణ్ రామ్ కామెంట్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ విషయంలో బ్రదర్ గా మాత్రమే నా పాత్ర ఉంటుందని కళ్యాణ్ రామ్ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు నేను కండీషన్లు పెట్టడం కరెక్ట్ కాదని ఎన్టీఆర్ అనుభవంతో పోల్చి చూస్తే నా అనుభవం చాలా తక్కువని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. మేమంతా ఒక కుటుంబం అని తాతగారి పేరుపై పెట్టిన బ్యానర్ విషయంలో నేను ఎంత బాధ్యతగా ఫీలవుతానో తమ్ముడు తారక్ కూడా అంతే బాధ్యతగా ఫీలవుతారని కళ్యాణ్ రామ్ కామెంట్లు చేశారు.

కళ్యాణ్ రామ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జై లవకుశ సినిమాకు ఈ సినిమాకు ఎలాంటి పోలిక లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus