Kalyanram: నందమూరి హీరోలు రెడీ.. అక్కినేని హీరోలు మాత్రం సైలెన్స్ వీడటం లేదుగా..!

‘గుండమ్మ కథ’ చిత్రానికి చాలా మంది లాయల్ ఫ్యాన్స్ ఉన్నారు.ఇప్పటి జనరేషన్ ను కూడా ఎంటర్టైన్ చేయగల స్టఫ్ ఈ కథలో ఉంది. అందుకే చాలా కాలంగా ‘గుండమ్మ కథ’ రీమేక్ వ్యవహారం చర్చల్లో నిలుస్తుంది. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 5 పైసలు, 10 పైసలు టికెట్ రేట్లు ఉన్న రోజుల్లోనే ఈ మూవీ రూ.50 లక్షల వరకు కలెక్ట్ చేసినట్లు చాలా మంది చెబుతూ ఉంటారు.

సాధారణ కథని ఇద్దరు స్టార్ హీరోలతో చేయడం వల్లే ఇది సాధ్యం కాలేదు. ఈ కథలో మంచి ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇది అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే ‘గుండమ్మ కథ’ కనుక రీమేక్ చేస్తే కనుక తాను నటించడానికి సిద్ధమని జూనియర్ ఎన్టీఆర్ 2011లోనే చెప్పుకొచ్చాడు. అయితే అక్కినేని ఫ్యామిలీ నుండి ఎవరైనా నటిస్తే ఆ రీమేక్ కు అందం వస్తుందని కూడా జూనియర్ చెప్పాడు.

అయితే అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఈ రీమేక్ పై స్పందించింది లేదు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ నటించే ఆస్కారం కూడా లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ ఇమేజ్ ఇప్పుడు బాగా పెరిగింది. వరుస ప్రాజెక్టులకు సైన్ చేశాడు. కాబట్టి ఇంకో 5 ఏళ్ళ వరకు ఎన్టీఆర్ ఖాళీ అయ్యే ఛాన్స్ లేదు. ఇలాంటి టైంలో కళ్యాణ్ రామ్ కు ‘గుండమ్మ కథ’ సినిమా రీమేక్ లో నటించాలని ఉందని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

అమిగోస్ ప్రమోషన్లలో భాగంగా అతను తన తాత గారు నటించిన సినిమాల్లో గుండమ్మ కథ, మిస్సమ్మ, కన్యా శుల్కం వంటి సూపర్ హిట్ సినిమాల రీమేక్ లలో నటించాలని ఉన్నట్టు అతను తెలిపాడు. మరి అక్కినేని ఫ్యామిలీ ఈ రీమేక్ పై ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus