Mokshagna: వారసుడు వస్తున్నాడు ఇక బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే..!

  • June 10, 2023 / 07:33 PM IST

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటెడ్‌గా ఎదురుచూస్తున్నారు. గతంలో అనేకసార్లు అతని డెబ్యూ మూవీ గురించి వార్తలు నెట్టింట స్ప్రెడ్ అయ్యాయి. లాంచింగ్ ప్రాజెక్ట్‌కు పూరీ జగన్నాథ్ వంటి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. అయితే, పలు ఈవెంట్స్‌లో మోక్షజ్ఞ బొద్దుగా కనిపించడంపై హీరోగా సెట్ అవుతాడా? అనే కామెంట్స్ కూడా నెటిజన్ల నుంచి వ్యక్తమయ్యాయి. పైగా ఇండస్ట్రీలో బాలయ్య లెగసీని కొనసాగించాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం యాక్టింగ్, డాన్స్ తదితర విషయాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు మోక్షజ్ఞ.

ఇదే క్రమంలో అతని లేటెస్ట్ స్టిల్స్ చూసి అవాక్కవుతున్నారు నెటిజన్లు. ఊహించని బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో కూడిన తన స్లిమ్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మోక్షజ్ఞ తన ఫ్రెండ్స్‌తో కనిపించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో తను స్లిమ్‌ బాడీతో హ్యాండ్సమ్‌గా కనిపించాడు. ఇక ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్‌కు నందమూరి లెగసీని తను కంటిన్యూ చేయగలడనే నమ్మకమొచ్చేసింది. నందమూరి మోక్షజ్ఞ కటౌట్ అదిరిందిగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీ వచ్చే ఏడాది ఉండబోతుందని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవలే ఫ్రెండ్ బెల్లంకొండ గణేష్.. తన ఫ్రెండ్ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశాడు. ‘నేను స్టూడెంట్ సర్’ ప్రమోషన్స్‌లో భాగంగా.. మోక్షజ్ఞ యాక్టింగ్, డాన్స్ స్కిల్స్‌తో పాటు డైలాగ్ డెలివరీ గురించి గొప్పగా చెప్పాడు. దీంతో అభిమానుల్లోనూ అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే.. ‘ఆదిత్య 369’ మూవీకి సీక్వెల్‌‌గా ‘ఆదిత్య 999’ తెరకెక్కిస్తానని బాలయ్య ఇదివరకే ప్రకటించారు.

నిజానికి ఈ మూవీకి లెజెండరీ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తారని అనుకున్నా.. దీనిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మాత్రం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీలో తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి నటించే అవకాశం ఉందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన వస్తే తప్ప అసలు విషయం తెలియదు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus