Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్ కు మరో షాక్ తప్పదా.. అప్పటివరకు ఆగాల్సిందే!

  • September 7, 2023 / 12:55 PM IST

నందమూరి బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే సరికొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని ఇందుకు సంబంధించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ 2024 సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీన విడుదల కానుందని ప్రచారం జరిగింది. అయితే ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి సంబంధించిన ఏదైనా అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.

ఈ ఏడాది కూడా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ మొదలయ్యే ఛాన్స్ అయితే లేదని ప్రచారం జరుగుతుండటం నందమూరి ఫ్యాన్స్ కు ఒకింత షాకేనని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండట గమనార్హం. నందమూరి మోక్షజ్ఞ సైతం మీడియాకు దూరంగా ఉన్నారు. త్వరలో నందమూరి బాలయ్య సైతం 2024 ఎన్నికల ప్రచారంతో బిజీ కానున్నారు. మోక్షజ్ఞ తొలి సినిమాకు దర్శకుడిగా ఎవరు వ్యవహరిస్తారనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.

మోక్షజ్ఞతో (Nandamuri Mokshagna) సినిమాలను నిర్మించడానికి చాలామంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే మోక్షజ్ఞ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ సొంత బ్యానర్ లోనే తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. తొలి సినిమా నుంచి మోక్షజ్ఞ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోక్షజ్ఞకు సోషల్ మీడియాలో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం.

సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రం మోక్షజ్ఞ కెరీర్ కు తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలి సినిమాతో సక్సెస్ సాధిస్తే మోక్షజ్ఞ స్టార్ హీరో స్టేటస్ ను అందుకోవడం సులువేనని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మోక్షజ్ఞ కెరీర్ పరంగా అంచనాలను మించి విజయాలను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus