Nandita Swetha: ‘హిడింబ’ లో లిప్ లాక్ సీన్స్, బెడ్ రూమ్ సీన్స్ పై స్పందించిన హీరోయిన్ నందిత శ్వేత!

  • July 19, 2023 / 10:51 PM IST

ఒకప్పుడు గ్లామర్ షోకి బౌండరీస్ పెట్టుకున్న కొంతమంది హీరోయిన్లు ఈ మధ్య ఏంటో.. ఆ బౌండరీస్ దాటేస్తున్నారు అని చెప్పాలి. తమన్నా ఈ విషయంలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈమె కెరీర్ ప్రారంభం నుండి గ్లామర్ పాత్రలే చేసినా.. హద్దులు మీరి లిప్ లాక్ సన్నివేశాలు, బెడ్ రూమ్ సీన్స్ లో నటించింది లేదు. కానీ ‘జీ ఖర్దా’ ‘లస్ట్ స్టోరీస్’ లో ఆమె ఏ రేంజ్ గ్లామర్ షో చేసిందో.. ఎలాంటి సన్నివేశాల్లో నటించిందో అందరికీ తెలుసు.

అనసూయ కూడా అంతే. బుల్లితెరపై అందాల విందు చేసినా… వెండితెర పై మాత్రం ఈమె మంచి మంచి పాత్రలతో ఆకట్టుకునేది. కానీ ‘విమానం’ తో రూటు మార్చింది. రాబోయే సినిమాల్లో అనసూయని మరింత గ్లామర్ రోల్స్ లో చూసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నందిత శ్వేత కూడా అదే రూట్లోకి వచ్చేసింది. కెరీర్ ప్రారంభం నుండీ పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో చేస్తూ వచ్చిన ఈ కన్నడ బ్యూటీ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ‘శ్రీనివాస కళ్యాణం’ ‘బ్లఫ్ మాస్టర్’ ‘ప్రేమ కథా చిత్రం 2’ ‘కల్కి’ ‘కపటదారి’ ‘అక్షర’ వంటి మంచి సినిమాలు చేసింది.

 

అయితే మరికొద్ది రోజుల్లో రాబోతున్న ‘హిడింబ’ సినిమాలో ఆమె హీరో అశ్విన్ తో ఘాటు లిప్ లాక్ లు, బెడ్ రూమ్ సన్నివేశాల్లో అదరగొట్టింది. దీనికి కారణం ఏంటని ఆమెను అడగ్గా.. ‘ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసింది. సీరియస్ గా సాగే రెండు పాత్రల మధ్యలో వచ్చే ఎమోషనల్ ట్రాక్ కి ఇది అవసరం. అందుకే చేశాను. గతంలో నేను ఇలాంటి సన్నివేశాల్లో నటించలేదు. ఇందులో చేయక తప్పలేదు’ అంటూ నందిత శ్వేత చెప్పుకొచ్చింది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus