సావిత్రిగారు కూడా మరీ ఇంత వెరీయేషన్ చూపించలేదు

అప్పట్లో ఒక సినిమాలో భార్యాభర్తలుగా కనిపించిన ఎన్ఠీఆర్-సావిత్రిల కాంబినేషన్ మరో సినిమాలో అన్నాచెల్లెళ్లుగా కనిపించేవారు. అందులో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే.. నటీనటులన్నాక ఎలాంటి పాత్రలోనైనా జీవించాల్సిందే. అయితే.. ఇటీవల కన్ఫర్మ్ అయిన ఒక కాంబినేషన్ మాత్రం ఫిలిం నగర్లో చర్చనీయాంశమైంది. అదే.. రాజశేఖర్-నందిత శ్వేత కాంబినేషన్. ఈ ఇద్దరు కలిసి ఆల్రెడీ “కల్కి” చిత్రంలో నటించారు. ఆ సినిమాలో వారిది ఆల్మోస్ట్ అన్నాచెల్లెళ్ల పాత్రల్లా ఉంటాయి. డైరెక్టర్ జస్టిఫికేషన్ కూడా అలానే ఇస్తాడు. అలాంటి రాజశేఖర్-నందిత శ్వేత ఇప్పుడు జంటగా అనగా.. హీరోహీరోయిన్లుగా నటించనున్నారు.

కృష్ణమూర్తి అనే యువకుడి దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రంలో అమలాపాల్ ఒక కథానాయికగా నటించనుండగా.. మరో కథానాయికగా నందిత శ్వేతను ఫైనల్ చేశారట. మునుపటి సినిమాలో అన్నాచెల్లెళ్ల రిలేషన్ లో కనిపించిన ఈ జంటను మన తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారో చూడాలి.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus