ఆ సినిమా విషయంలో నాని చెప్పిందే నిజమవుతుందా?

శ్రీవిష్ణు,నివేదా థామస్, సత్య దేవ్, నివేదా పేతురేజ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందిన తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రాన్ని విజయ్ కుమార్ మన్యం నిర్మించాడు. జులై 28 న ఈ చిత్రం విడుదలయ్యింది. కామెడీ క్రైమ్ థ్రిలర్ గా రూపొందిన ఈ చిత్రం అద్భుతమంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పైసా వసూల్ మూవీ అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు. హీరో శ్రీవిష్ణు అలాగే దర్శకుడు వివేక్ కలిసి ‘మెంటల్ మదిలో’ తరువాత మరో హిట్ ను తమ ఖాతాలో వేసుకున్నట్టయ్యింది.

ఇదిలా ఉండగా ఈ చిత్రం అద్భుతమంటూ నేచురల్ స్టార్ నాని నిన్న రాత్రే తన ట్విట్టర్ ద్వారా చెప్పడం విశేషం. ‘ఈ చిత్రంలో కామెడీ చాలా బాగుందని, నటీనటులందరూ బాగా నటించారని… డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ కూడా మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడని’ తన ట్వీట్లో పేర్కొన్నాడు నాని. ఇక ఈ రోజు సినిమా విడుదలైన తరువాత టాక్ ను బట్టి చూస్తే ఈ చిత్రం నాని చెప్పినట్టే మంచి హిట్ అని స్పష్టమవుతుంది. మరి వసూళ్ళు ప్రేక్షకులు చెబుతున్న స్థాయిలో వస్తాయో లేదో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus