ఏం చేయాలో దర్శకుడే చూసుకోవాలి మరి

  • January 28, 2021 / 01:01 PM IST

తెలుగు సినిమాలకు… ఆ మాటకొస్తే అసలు అన్ని భాషల సినిమాలకు వివాదం పెద్ద కొత్తేం కాదు. కథ, పాత్రలు, పేర్లు, పోస్టర్లు, లుక్‌లు ఇలా చాలా విషయాల్లో వివాదాలు వస్తూనే ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా జనాలు చూస్తుంటారు. పట్టించుకుంటే ఇంకా ఎక్కువమంది చూస్తారు. అయితే ఇవేవీ కాకుండా కూడా సినిమాలు వివాదాల్లోకి చిక్కుకుంటాయి. అలా నాని కొత్త సినిమా ‘అంటే సుందరానికి’ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఈసారి కారణం దర్శకుడు. ఆయన గతంలో ఓ నిర్మాతతో చేసుకున్న అగ్రిమెంటే దీనికి కారణం.

నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ ఇటీవలే ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యిందో లేదో నిర్మాత రాజ్‌ కందుకూరి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. నిజానికి వివేక్ ఆత్రేయ తన రెండో సినిమాను రాజ్‌ కందుకూరి నిర్మాణంలోనే చేయాలి. వివేక్‌ తన మొదటి సినిమాను రాజ్ కందుకూరి ప్రొడక్షన్‌ హౌస్‌లోనే చేసిన విషయం తెలిసిందే. ఆ సయమంలో తర్వాతి సినిమాను కూడా అదే బ్యానర్‌ లో చేస్తా అని ఒప్పందం కుదుర్చుకున్నాడట. అయితే వివిధ కారణాల వల్ల రెండో సినిమాను మరో బ్యానర్‌లో చేశాడు. ఆ సమయంలో మూడో సినిమాను తప్పకుండా మీ బ్యానర్‌లో చేస్తానని రాజ్‌ కందుకూరికి మరో అగ్రిమెంట్‌ ఇచ్చాడ వివేక్‌.

కానీ వివేక్ ఆత్రేయ ‘అంటే సుందరానికి‘ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో చేస్తున్నాడు. దీంతో ‘‘ఇప్పటికే ఒకసారి వదిలేశాను. మూడో సినిమా తన బ్యానర్‌ లో చేయకుండా మరో బ్యానర్‌ లో చేస్తుండటంతో దర్శకుడు వివేక్‌ ఆత్రేయపై చర్యలు తీసుకోవాలి’’ అని రాజ్ కందుకూరి డిమాండ్ చేస్తున్నాడు. తనతో అగ్రిమెంటట్‌లోలో ఉన్న వివేక్‌ ఆత్రేయతో ఇలా సినిమా చేయడం సరికాదని మైత్రి మూవీ మేకర్స్‌ టీమ్‌తో రాజ్ కందుకూరి అన్నాడట. నిర్మాతల మండలికి ఈ వివాదం వెళ్లడంతో… ఏమవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus