Nani: లిప్ లాక్ లపై హీరో నాని ఓపెన్ కామెంట్స్..!

  • October 17, 2023 / 12:21 AM IST

‘హాయ్ నాన్న’ అనే మరో ఫ్యామిలీ డ్రామాతో థియేటర్లలో సందడి చేయనున్నారు నాని. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలయ్యింది. టీజర్ లాంచ్ వేడుకలో నానితో పాటు ఇతర మూవీ టీమ్ కూడా పాల్గొని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు ‘హాయ్ నాన్న’ విశేషాలను పంచుకున్నారు. అదే సమయంలో ప్రతీ సినిమాలో లిప్ లాక్ చేయడం గురించి నానికి ప్రశ్న ఎదురవ్వగా దానికి సింపుల్‌గా సమాధానమిచ్చారు నాని.

పెళ్లికాకముందు నుండే తనకు ఒక ఆడపిల్ల తండ్రి కావాలని కల అని నాని బయటపెట్టారు. అయితే ‘హాయ్ నాన్న’ సినిమా ద్వారా తనకు ఆ కలలో జీవించే అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉందన్నారు. స్క్రిప్ట్ చాలా బాగుందని, అందరూ కనెక్ట్ అవుతారని, తన కెరీర్‌లో ఇదొక స్పెషల్ సినిమా అని నాని చెప్పుకొచ్చారు. అయితే నాని సినిమాలు ప్రేక్షకుల్లో ఆదరణ సంపాదించుకున్నా కూడా కలెక్షన్స్ విషయంలో అప్పుడప్పుడు కాస్త వెనకబడుతూ ఉంటాయి.

‘హాయ్ నాన్న’ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ చూస్తుంటే ‘సైంధవ్’లాగా ఉందని ఒకరు ప్రశ్నించారు. అయితే దానికి, దీనికి చాలా తేడా ఉందని నాని హామీ ఇచ్చారు. మీరు నటించిన ప్రతీ సినిమాలో లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని ‘హాయ్ నాన్న’ టీజర్‌లోని లిప్ లాక్స్‌ను ఉద్దేశించి నానిని ప్రశ్నించారు. అయితే ‘‘ప్రతీ సినిమాలో ఏమీ లేవు. నా ముందు సినిమా దసరా, అంతకు ముందు అంటే సుందరానికీ.. ఈ రెండు సినిమాల్లో లేవు. కాబట్టి ప్రతీ సినిమాలో ఉంటాయి అనడంలో లాజిక్ లేదు.

కేవలం టీజర్ కోసం లిప్ లాక్స్ అనేవి చేయను. సీన్‌కు అవసరమయితేనే చేస్తాను.’’ అని నాని ముక్కుసూటిగా సమాధానమిచ్చారు. ఇక ‘సలార్’ వల్ల ‘హాయ్ నాన్న’ రిలీజ్ డేట్‌ను ప్రీపోన్ చేసి డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ‘హాయ్ నాన్న’ కోసం మృణాల్‌తో తొలిసారి జతకట్టారు (Nani) నాని. శౌర్యువ్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus