సినిమా కంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటున్న నేచురల్ స్టార్.!

గ్రహచారం బాగోలేక “కృష్ణార్జున యుద్ధం” ఒక్కటీ ఫ్లాప్ అయ్యింది నాని ట్రిపుల్ హ్యాట్రిక్ రికార్డ్ ను అడ్డుకొంది కానీ.. ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే నాని మరో పవన్ కళ్యాణ్ అయిపోయేవాడు (ఇండస్ట్రీలో ఏడు వరుస విజయాలు ఉన్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే). కానీ.. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో దాదాపు మూడేళ్ళ తర్వాత నాని తొలి పరాజయాన్ని చవిచూశాడు. అయితే.. మనోడికి వరుసబెట్టి ఇంకో అయిదారు సినిమాల లైనప్ ఉంది కాబట్టి పెద్ద ప్రోబ్లమ్ ఏమీ లేదు కానీ.. ఒక చిన్న బ్రేక్ మాత్రం పడినట్లే.

అయితే.. ఈ పరాజయం వల్లనో లేక మరింకేదైనా కారణమో తెలియదు కానీ.. “బిగ్ బాస్” సీజన్ 2 కోసం నానిని ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. మొదటి సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీయార్ కి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ను పే చేసిన స్టార్ సంస్థ ఇప్పుడు సెకండ్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించనున్న నానికి మాత్రం 3.5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వనుంది. నాని జనరల్ గా ఒక సినిమాకి ప్రస్తుతం అయిదు కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. అలాంటిది దాదాపు ఎనిమిది నుంచి 10 ఎపిసోడ్స్ తోపాటు బోలెడన్ని ప్రోమోలు షూట్ చేయాల్సిన నానికి కేవలం 3.5 కోట్ల రెమ్యూనరేషన్ ఏంటని ఇండస్ట్రీ టాక్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus