మొన్న ‘అర్జున్ రెడ్డి’ ఇప్పుడు ‘జెర్సీ’

ఈ సమ్మర్ కి విడుదలైన నాని ‘జెర్సీ’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రెండు ప్లాపులతో సతమతమవుతున్న నానికి ఈ చిత్రం పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా నాని కెరీర్ లోనే బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. మాస్ జనాల్ని పక్కన పెడితే… మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు ఈ చిత్రం తెగ నచ్చేసింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ చిత్రం పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయబోతున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ‘జెర్సీ’ యొక్క హిందీ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడట. ఈ రీమేక్‌ ను కూడా గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం. ఇక హిందీ వెర్షన్‌ లో నాని పాత్రని షాహిద్ కపూర్ చేయబోతున్నాడట. ఈ మధ్యే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ అయిన ‘కభీర్ సింగ్’ తో భారీ హిట్టందుకున్నాడు షాహిద్. ఇప్పుడు మరో రీమేక్ లో నటించడానికి రెడీ అవుతున్నాడన్న మాట. మొత్తానికి ‘జెర్సీ’ వంటి మంచి సినిమాని బాలీవుడ్ కూడా గుర్తించడం మంచి విషయమే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus