Hi Nanna: హాయ్ నాన్న మూవీ చూసి సెన్సార్ సభ్యులు అలా అన్నారా?

  • November 22, 2023 / 08:29 PM IST

న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ కాంబోలో తెరకెక్కిన హాయ్ నాన్న మూవీ రిలీజ్ కు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా కోసం నాని మరింత విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే తాజాగా సెన్సార్ సభ్యులు ఈ సినిమాను చూశారని తెలుస్తోంది. ఈ సినిమాను చూసి సెన్సార్ సభ్యులు ఎమోషనల్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తండ్రీ కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని సెన్సార్ సభ్యుల నుంచి సమాచారం అందుతోంది.

సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టారంటే ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా మెప్పించనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మృణాల్ ఠాకూర్ గ్లామర్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది. హాయ్ నాన్న మూవీకి బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగిందనే టాక్ వినిపిస్తోంది. హాయ్ నాన్న క్లాస్ మూవీ అయినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హాయ్ నాన్న (Hi Nanna) ఫుల్ రన్ లో దసరా కలెక్షన్లను మించి కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హాయ్ నాన్న సినిమాతో శౌర్యువ్ స్థాయి కూడా పెరగడం ఖాయమని మరి కొందరు చెబుతున్నారు. నాని నమ్మకాన్ని హాయ్ నాన్న నిజం చేస్తుందేమో చూడాలి. నాని తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నాని నటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

న్యాచురల్ స్టార్ నాని కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యంగ్ టాలెంట్ ను నాని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. నాని రాబోయే రోజుల్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటించి సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది. హాయ్ నాన్న మూవీ ఇతర భాషల్లో కూడా విడుదల కానుండగా అక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus