నేచురల్ స్టార్ గా పేరుతెచ్చుకున్న నాని సూపర్ ఫాస్ట్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకటి చొప్పున సినిమాలను రిలీజ్ చేస్తూ దూసుకుపోతున్నారు. నేను లోకల్ సినిమాని రిలీజ్ చేసిన వెంటనే ఆ చిత్ర విజయాన్ని ఆస్వాదించకుండానే మరో చిత్రాన్ని మొదలెట్టేయడం, సగం షూటింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగిపోయాయి. నూతన దర్శకుడు శివ నిర్వాన డైరెక్షన్లో నాని “నిన్నుకోరి” చిత్రాన్ని చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ వంటి ఆకర్షణీయమైన లోకేషన్లలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం వైజాక్ లో హీరో నాని, హీరోయిన్ నివేత థామస్ లపై రొమాంటికి సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తో ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవుతుందని చిత్ర బృందం వెల్లడించింది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టనున్న ఈ మూవీని జూలై 11వ తేదీన రిలీజ్ చేయాలనీ నిర్మాత ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్నీ చిత్ర బృందం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.