విప్లవ కథా చిత్రాల కథానాయకుడు ఆర్ నారాయణ మూర్తి నటన అంటే చాలా మందికి ఇష్టం. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా పదుల సంఖ్యలో చిత్రాలు చేసినప్పటికీ చాలా సామాన్యంగా బతుకుతుంటారు. అందుకే అతన్ని రియల్ లైఫ్ లోను చాలా మంది హీరోగా భావిస్తుంటారు. ఆ అభిమానంతో అతనికి తగిన పాత్రను టెంపర్ సినిమాలో రాసుకున్నారు డైరక్టర్ పూరి జగన్నాథ్. మూర్తి అనే క్యారెక్టర్ లో నటించమని నారాయణ మూర్తిని అడిగారంట.
కానీ అందుకు ఆయన ఒప్పుకోలేదు. నటించనని సున్నితంగా చెప్పారు. దీంతో ఆ పాత్రలో పోసాని కృష్ణ మురళిని తీసుకున్నారు. ఆ క్యారక్టర్ పోసానికి మంచి పేరు తెచ్చి పెట్టింది. అటువంటి పాత్రను ఎందుకు వదులుకున్నారని ఈ మధ్య నారాయణ మూర్తి ని అడగగా ఆయన ఇలా సమాధానం చెప్పారు. “నేనంటే పూరి జగన్నాథ్ కి అభిమానం. నాక్కూడా ఆయనంటే అభిమానమే. నాకోసం మంచి పాత్ర సృష్టించారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. హీరోగా చిత్రాలను చేస్తున్న ఈ సమయంలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి నా మనసు ఒప్పుకోలేదు. అందుకే వద్దన్నాను” అని వివరించారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన “హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య” త్వరలో రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.