Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?
- September 28, 2026 / 03:36 PM ISTByFilmy Focus Desk
ఒకప్పుడు పాటను యాజ్ ఇట్ ఈజ్ లేపేసినా.. ఎవరికీ పెద్దగా తెలిసేది కాదు. ఆ తర్వాత విదేశీ సంగీతంతో పరిచయం పెరిగాక చిన్న మ్యూజిక్ బిట్ ఒకేలా ఉన్నా.. ఆ పాటకు ఈ పాట కాపీ అంటూ పోలికలు మొదలెట్టేశారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చాక ఈ విషయంలో పోలికలు పెరిగాయి, దొరికిపోవడాలూ పెరిగాయి. ఈ క్రమంలో మన సంగీత దర్శకులు జాగ్రత్త పడుతున్నారు. అయితే ఆ పాట మా పాటకు స్ఫూర్తి అని చెప్పేస్తున్నారు. లేదంటే రీమేక్ చేసేశాం అని ఒప్పుకుంటున్నారు.
Aadarsha Kutumbam
ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ విషయంలో కూడా ఏదో ఒక విషయం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా నుండి ఇటీవల ‘నారాయణమ్మ..’ అనే పాట విడుదలైంది. ఈ పాట వినగానే నచ్చేసింది, ఎక్కేసింది కూడా. ‘నారాయణమ్మ..’ అనే హుక్ లైన్ కనెక్ట్ అయ్యింది. అయితే ఇది మరో సినిమాలోని పాటలా ఉందంటూ ఓ చర్చ మొదలైంది. అప్పుడెప్పుడో వచ్చిన ‘రంగూన్ ఉత్తరం’ అనే ఆల్బమ్‌లోని ‘నారాయణమ్మ..’ అనే పాటలా ఉందనేది ఫైండౌట్.
అయితే.. కాపీ అనే మరక రాకుండా ఉండటానికి.. అఫీషియల్‌గా ఈ పాటను తీసుకొని రీమిక్స్ చేశామని చెప్పేయొచ్చు. లేదంటే ఇప్పటి వరకు ఇటు తమన్ మీద, అటు త్రివిక్రమ్ మీద ఉన్న కాపీ మరకలు చాలవనట్లు ఈ పాట మరక ఒకటి కలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కొన్ని హిట్ సినిమాల మిక్సింగ్ అనే విమర్శ ఉంది. ముఖ్యంగా ‘బ్లాస్ట్’ సినిమాకు దగ్గరగా ఉంటుంది అనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ సమయంలో మరో కాపీ మరక తీసుకోదు సినిమా టీమ్.
‘నారాయణమ్మ..’ పాట సంగతి చూస్తే.. ఈ పాట 1997లో వచ్చిన ప్రసిద్ధ తెలుగు జానపద ఆల్బమ్. దిమిలి పొడుగు మనిషి అలియాస్ దిమిలి సన్యాసిరావు ఈ పాట రూపొందించారు. ఈ పాటలో సాహిత్యం కాస్త అటుఇటుగా ఉంటుంది కూడా. మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌ల రికార్డుల ప్రకారం ఫిబ్రవరి 1, 1997న ఈ పాట అధికారికంగా విడుదలైంది.
















