సాధారణంగా సినిమా వాళ్ళు తమ పర్శనల్ లైఫ్ గురించి… చిన్న విషయం బయటకు చెప్పాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఇందుకు రెండు కారణాలు ఉంటాయి. ఒకటి తమ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో, రెండు తమ వల్ల జనాలు తప్పుదోవ పడితే.. చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి.. వస్తుందని..! ఓ రకంగా రెండో రీజన్ మంచిదే. ఆ యాంగిల్ లో ఆలోచించే సెలబ్రిటీలు కూడా ఓ రకంగా మంచోళ్లే అని చెప్పాలి.
అన్నీ ఎలా ఉన్నా.. ఎవరి పర్శనల్ లైఫ్ వాళ్ళది అని జనాలు కూడా సరిపెట్టుకుంటారు. ఇదిలా ఉంటే.. (Naresh) నరేష్ , పవిత్ర ల తీరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉందని చెప్పాలి. వీళ్ళు తమ పర్సనల్ లైఫ్ తో ఆల్రెడీ మళ్లీ పెళ్లి అనే సినిమా తీయించుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో నరేష్, పవిత్ర వ్యవహరించే తీరు కూడా అందరినీ పక్కదోవ పట్టించే విధంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి కాదు.
కొన్ని ఇంటర్వ్యూలలో వీళ్ళ లవ్ స్టొరీ ఎలా స్టార్ట్ అయ్యిందీ అనేది చెప్పడం.. అలాగే కొంతమంది యాంకర్లు.. పిల్లల గురించి కూడా ప్రశ్నలు వేయడం.. చాలా డీగ్రేడింగ్ గా అనిపిస్తుంది. ఇద్దరికీ ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయ్యాయి. పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు అవుతున్నారు. పోనీ వీళ్ళు పెళ్లి చేసుకున్నారా అంటే.. అది లేదు. కానీ పిల్లల్ని కనడంలో తప్పేముంది అంటూ బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!