Mahesh: మహేష్ అభిమానులను ఇబ్బంది పెడుతున్న నరేష్ – పవిత్ర ల కామెంట్స్..!

నరేష్, పవిత్ర ల వ్యవహారం అందరికీ తెలిసిందే. నరేష్.. పవిత్రతో నాలుగో కాపురం పెట్టారు. పవిత్రకి కూడా ఆల్రెడీ పెళ్లైంది.ఒకటి కాదు రెండు పెళ్లిళ్లు అయ్యాయి అనే టాక్ కూడా ఉంది. అది పక్కన పెడితే నరేష్ తన మూడో భార్యతో విడాకులు తీసుకోకపోయినా 4వ పెళ్లి చేసుకున్నా.. లేకున్నా నాలుగో కాపురం పెట్టాడు అన్నది వాస్తవం. అలాగే ఈ జంట ‘మళ్ళీ పెళ్లి’ అనే చిత్రంలో నటించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. మే 26న ఈ సినిమా విడుదల కాబోతుంది.

ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో నరేష్- పవిత్ర ఈ చిత్రాన్ని చాలా యాక్టివ్ గా ప్రమోషన్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో వీరు మహేష్ బాబు – నమ్రత ల టాపిక్ ను తీసుకురావడం మహేష్ అభిమానులను, కృష్ణ అభిమానులను ఇబ్బంది పెడుతుంది. నరేష్ తల్లి విజయనిర్మల..కృష్ణకి రెండో భార్య. విజయనిర్మల మరణించిన తర్వాత కూడా కృష్ణ… నరేష్ వద్దే ఉన్నారు.సో నరేష్ – పవిత్ర ల బంధానికి ఇష్టం ఉన్నా.. లేకపోయినా కృష్ణ వ్యతిరేకించే అవకాశం ఉండదు.

అది ఆమోదం అనుకోవడంలో కూడా తప్పులేదు. అలాగే నరేష్ పర్సనల్ వ్యవహారాలు కూడా మహేష్ బాబుకు అవసరం లేదు.నమ్రత కూడా అదే భావించి ఉండవచ్చు. అయితే నరేష్ – పవిత్ర..లు ‘మళ్ళీ పెళ్లి’ సినిమా ప్రమోషన్స్ లో తమ బంధాన్ని మహేష్ – నమ్రత అంగీకరించినట్టు చెప్పుకొస్తున్నారు. ఇది మహేష్ అభిమానులను కొంత ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తుంది. ఇక ‘మళ్ళీ పెళ్లి’ చిత్రాన్ని యం.యస్.రాజు డైరెక్ట్ చేశారు. ఈయన (Mahesh) మహేష్ బాబుకి గతంలో ‘ఒక్కడు’ వంటి బ్లాక్ బస్టర్ ను అందించారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus