Pavitra Lokesh: నరేష్ నా పార్ట్నర్ మాత్రమే కాదు… సపోర్ట్ సిస్టం కూడా!

నటి పవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు గత కొంతకాలంగా సహజీవనంలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక వీరి వ్యవహారం గురించి తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. అయితే నరేష్ పవిత్ర లోకేష్ కి సంబంధించిన ఈ విషయమైనా క్షణాలలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇలా నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహార ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గానే ఉందని చెప్పాలి. ఇక వీరిద్దరూ తాజాగా నటించిన చిత్రం మళ్ళీ పెళ్లి.

ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా గురించి తమ వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను తెలియచేస్తున్నారు. ఈ క్రమంలోనే నరేష్ గురించి పవిత్ర లోకేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నరేష్ ఆస్తి చూసి (Pavitra Lokesh) పవిత్ర లోకేష్ తనని ఇష్టపడింది అంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి అయితే ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదంటు నరేష్ కూడా ఈ వార్తలను కొట్టి పారేశారు. తమది పవిత్ర బంధం అంటూ ఈయన పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా వేశారు. అయితే ఈ విషయంపై పవిత్ర లోకేష్ కూడా స్పందించి తమ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎలాంటిదో తెలియజేశారు.

ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ మాట్లాడుతూ నరేష్ తనకు లైఫ్ పార్ట్నర్ మాత్రమే కాదని ఒక సపోర్టింగ్ సిస్టమ్ అని కూడా తెలియజేశారు. ఏ విషయంలోనైనా ఆయన సపోర్ట్ తనకు చాలా ఉంటుందని పవిత్ర లోకేష్ తెలియజేశారు. పవిత్ర గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చినప్పుడు నరేష్ తనకు ఎంతో అండగా నిలిచారని ఈ సందర్భంగా నరేష్ తో తనకున్నటువంటి రిలేషన్ గురించి పవిత్ర లోకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus