ఓ నటి చెల్లెలు తన ప్రియుడిని దారుణంగా కాల్చి చంపడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఘటన యావత్ సినీ పరిశ్రమని కదిలించింది అని చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. ‘రాక్ స్టార్’ మూవీ నటి నర్గీస్ ఫక్రి (Nargis Fakhri) అందరికీ సుపరిచితమే. ఆమె సోదరి అలియా ఫక్రీని తాజాగా న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వయసు 43 ఏళ్ళు. అయితే మాజీ ప్రియుడు జాకబ్ ను హత్య చేసినందుకు గాను పోలీసులు అలియాని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
2024 నవంబర్ 2న న్యూయార్క్ లో ఉన్న రెండు అంతస్థుల గ్యారేజీని అలియా తగలబెట్టినట్లు సమాచారం. మాజీ ప్రియుడు ఎడ్వర్డ్స్ జాకబ్స్, అతని స్నేహితురాలు ఎటీన..లను కక్షపూరితంగా ఆమె కాల్చి చెంపేసినట్టు తెలుస్తుంది. ‘ఈరోజు మీరంతా చనిపోబోతున్నారంటూ’ బిగ్గరగా అరిచి మరీ గ్యారేజ్ కి ఆమె నిప్పంటించినట్టు స్థానికులు అలాగే డిస్ట్రిక్ట్ అటర్నీ మెలిండా కెట్జ్ కార్యాలయం వారు తెలిపారు.
జాకబ్స్ అలాగే అతని స్నేహితురాలు ఆ టైంలో పై అంతస్తులో నిద్రపోతుండటంతో అలియా తలపెట్టిన ఘోరం గురించి తెలుసుకోలేక శాశ్వతమైన నిద్రలోకి వెళ్లిపోయారని డిస్ట్రిక్ట్ అటర్నీ మెలిండా కెట్జ్ కార్యాలయం,స్థానికులు వెల్లడించడం జరిగింది. గతేడాది అలియాతో రిలేషన్ షిప్ కి జాకబ్ బ్రేకప్ చెప్పాడు. ఇది ఆమెకు నచ్చలేదట. ఈ విషయాన్ని అలియా తల్లి వెల్లడించింది. మరోపక్క జాకబ్ వేరే అమ్మాయితో డేటింగ్లో ఉన్నాడట. ఈ విషయం తెలిసినప్పటి నుండి అలియా పగతో రగిలిపోతున్నట్టు కూడా ఆమె స్నేహితులు తెలిపారు.