‘పుష్ప 2’ మిస్ అవ్వకుండా చూడాలనడానికి గల 5 కారణాలు..!

  • December 2, 2024 / 07:04 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) , స్టార్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) రూపొందింది. డిసెంబర్ 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది. డిసెంబర్ 4 నుండే ప్రీమియర్స్ పడనున్నాయి. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. మొదటి భాగంగా సూపర్ హిట్ అవ్వడంతో.. దీనిపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ‘టికెట్ రేట్లు భారీగా పెంచేయడంతో సామాన్యులు ఈ సినిమాని మొదటి వారం చూడగలరా?’ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సరే ఆ విషయాలు పక్కన పెట్టేసి.. ‘పుష్ప 2’ కచ్చితంగా చూడటానికి 5 కారణాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

Pushpa 2

1) అల్లు అర్జున్ నట విశ్వరూపం :

‘పుష్ప’ తో అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోగా చరిత్ర సృష్టించాడు. ఆ సినిమాలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటన నిజంగానే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.మేకోవర్ మార్చుకుని.. ఎండనకా, వాననకా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అల్లు అర్జున్. సెకండ్ పార్ట్ లో కోసం కూడా ప్రాణం పెట్టి పనిచేశాడని అంటున్నారు. 3 ఏళ్ళ తర్వాత అల్లు అర్జున్ నుండి వస్తున్న సినిమా ఇది. అతని ఎఫర్ట్స్ కోసం కచ్చితంగా ఈ చిత్రాన్ని ఒకసారి థియేటర్లలో చూడాలి.

2 ) సుకుమార్ టేకింగ్ :

ఔట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లి మాస్ సినిమా ఎలా తీయాలో ‘పుష్ప’ తో (Pushpa)  పాన్ ఇండియా హిట్ కొట్టి చూపించాడు సుకుమార్ (Sukumar). మొదటి పార్ట్ లో చాలా చిక్కుముడులు వేశాడు. వాటిని సెకండ్ పార్ట్ లో ఎంత అందంగా విప్పాడో చూడాలి.

3) శ్రీవల్లి పాత్ర చనిపోతుందా?

‘పుష్ప’ లో శ్రీవల్లిగా రష్మిక  (Rashmika Mandanna) గ్లామర్ బాగా హైలెట్ అయ్యింది. ‘పెళ్ళాం మాట మొగుడు వింటే ఎలా ఉంటాదో ఈ పెపంచానికి చూపిస్తా’ అనే ఒక్క డైలాగ్ తో సెకండ్ పార్ట్ లో ఈమె నటన, ‘పీలింగ్స్’ సాంగ్ తో ఈమె గ్లామర్ కూడా హైలెట్ అయ్యేలా ఉంది. అయితే సెకండ్ పార్ట్ లో శ్రీవల్లి పాత్ర చనిపోతుంది అని మొదటి నుండి గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి అది నిజమో.. కాదో? సినిమా చూస్తే కానీ చెప్పలేం. కానీ ఇది కూడా ఆసక్తి పెంచే అంశం.

4) దేవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటుందా?

‘పుష్ప 2’ కి హైప్ పెరిగింది మొదటి గ్లింప్స్ తో..! దానికి దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)  అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మామూలుగా ఉండదు. అయితే సినిమాకి బ్యాక్ గ్రౌండ్ అందించే బాధ్యతని తమన్ (S.S.Thaman)  , అజనీష్ లోకనాథ్(B. Ajaneesh Loknath), సామ్ సిఎస్ (Sam C. S.) ..లకు అందించినట్టు టాక్ నడుస్తుంది. మరి దేవికి క్రెడిట్ దక్కిందో లేదో తెలియాల్సి ఉంది.

5) గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్?

‘పుష్ప 2’ ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుండి గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ గురించి ఎక్కువ హైలెట్ చేస్తూ వస్తున్నారు. సినిమాలో 15 నిమిషాలు ఉండే ఈ సీక్వెన్స్ ని రెండు నెలల పాటు చిత్రీకరించారట. కేవలం ఈ సీక్వెన్స్ కోసం రూ.70 కోట్లు ఖర్చు పెట్టారట. మాస్ ఆడియన్స్ కి గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఈ సీక్వెన్స్ ఉంటుంది అంటున్నారు. మరి సినిమాలో ఇది ఎక్కడ వస్తుందో చూడాలి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus