ప‌వ‌న్ కోసం భ‌లే పిల్ల‌.. ఇంత‌కీ సెట్ అవుతుందా..?

టాలీవుడ్ ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస బెట్టి సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా, ఆ వెంట‌నే క్రిష్ తెర‌కెక్కించే సినిమాలో ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు ప‌వ‌న్. మొగ‌లాయుల కాలంగ‌నాటి క‌థా నేప‌ధ్యంలో, పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ బందిపోటు పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు టాక్ విన‌ప‌డుతోంది. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ప‌వ‌న్ స‌ర‌స‌న ఈ సినిమాలో మొద‌ట హీరోయిన్‌గా బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి.

అయితే ఇప్పుడు తాజాగా విన‌ప‌డుతున్న టాక్ ఏంటంటే నేచుర‌ల్ హీరోయిన్ సాయి ప‌ల్ల‌విని చిత్ర యూనిట్ సంప్ర‌దించింద‌ని తెలుస్తోంది. అయితే సాయి ప‌ల్ల‌వి ఈ మూవీలో న‌టించేందుకు ఓకే చెప్పిందో లేదో తెలియ‌దు కానీ, ఈ ప్రాజెక్ట్‌లో ఆమె ఫిక్స్ అయ్యింద‌నే వార్త‌లు జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి. క‌థ‌లో భాగంగా హీరోయిన్ జ‌మీందార్ కూతురిగా క‌నిపిస్తోంది. దీంతో అస‌లే క‌థ మొగ‌లాయుల కాలం నాటిది కావ‌డంతో సాయి ప‌ల్ల‌వి ఈ పాత్ర‌కు సెట్ అవుతుందా అనే ప్ర‌శ్న‌లు త‌లెత్త‌గా, జాన‌ప‌ద ఛాయ‌లు ఉండే క్యారెక్ట‌ర్ కావ‌డంతో, ప‌ల్ల‌వి ప‌ర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుందే కామెంట్స్ విన‌ప‌డుతున్నాయి.

స‌హ‌జంగానే ఆమె న‌ట‌న‌కు పేరు పెట్టాల్సిన ప‌నిలేదు. అయితే ప‌వ‌న్ ప‌క్క‌న జోడీగా ఆమె సెట్ అవుతుందా లేదా అనేది ఆశ‌క్తిగా మారింది. ఇక‌ ఇప్ప‌టికే ‌మొద‌ట ప్రగ్యా జైస్వాల్, ఆ త‌ర్వాత జాక్వెలిన్ న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అలాగే ఇటీవ‌ల నిథి అగ‌ర్వాల్ ఒకే అయ్యింద‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇప్పుడేమో కొత్త‌గా తెరపైకి సాయిప‌ల్ల‌వి వ‌చ్చి చేరింది. మ‌రి సాయి ప‌ల్ల‌విని అయినా ఫైన‌లైజ్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ప‌వ‌న్ -క్రిష్ కాంబోలో తెర‌కెక్కే సిన‌మాలో ఫైన‌ల్‌గా ఏ భామ‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేస్తారో చూడాలి. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్ర‌ముఖ నిర్మాత ఏ ఎం ర‌త్నం భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.‌

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus