నేచురల్ స్టార్ దొంగగా.. ఎందుకు మారాడంటే?

నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో నాని నటనకు చప్పట్లు కొట్టని వారంటూ ఉండరు. ఎప్పుడూ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే నాని… ‘జెర్సీ’ చిత్రంతో ప్రేక్షకుల చేత కంటతడి కూడా పెట్టించి మెప్పించాడు. ‘కృష్ణార్జున యుద్ధం’ ‘దేవదాస్’ వంటి చిత్రాలు నిరాశపరచడంతో… ఏమాత్రం తగ్గకుండా ‘జెర్సీ’ చిత్రంతో హిట్టు కొట్టాడు. ఇక నాని ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ‘గ్యాంగ్ లీడర్’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని ఓ దొంగగా కనిపించబోతున్నాడట.

‘గ్యాంగ్‌ లీడర్‌’.. చిత్రంలో నాని మొదట రైటర్ గా కనిపిస్తాడట. అయితే కొన్ని పరిస్దితుల్లో నాని ఓ గ్యాంగ్ ని లీడ్ చేయాల్సి వస్తుందట. ఆ గ్యాంగ్ లో ఎనిమిదేళ్ళ ఓ పాప, పదిహేడేళ్ళ అమ్మాయి, ఇరవై రెండేళ్ళ పడుచు, యాభై ఏళ్ళ అమ్మ, ఎనభై ఏళ్ళకి దగ్గర్లో ఉన్న ఓ బామ్మ… ఇలా ఐదుగురుంటారట. ఈ గ్యాంగ్ తో కలిసి కొన్ని చిన్న చిన్నదొంగతనాలు కూడా చేస్తాడట నాని. ఈ సీన్లతో చాలా ఫన్ జనరేట్ అవుతుందట. ‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. ఆగష్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఈ చిత్ర నిర్మాతలైన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ప్లాన్ చేస్తున్నారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus