నవదీప్ ట్రిప్ పై అనసూయ ఇంట్రెస్ట్!

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గింది. సెలబ్రిటీలంతా కూడా తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ నేరుగా తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో నటుడు నవదీప్ తన హిమాలయాల ట్రిప్ విశేషాలను చెబుతూ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ సెషన్ లో పాల్గొన్నాడు. ఈ లైవ్ లో నవదీప్ ని అభిమానులు తమకి నచ్చిన విషయాలను అడగొచ్చు. ఈ చాటింగ్ లోకి వచ్చిన అనసూయ నవదీప్ తో మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల తన స్నేహితులతో కలిసి హిమాలయాల ట్రిప్ వేశారు నవదీప్. హైదరాబాద్ నుండి బైకులపై బయలుదేరి సరదాగా హిమాలయాల పరిసర ప్రాంతాలన్నీ చుట్టి వచ్చి ఆయన ఆ విశేషాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు వెల్లడించారు. ఇంతలో ఆ చాట్ లోకి వచ్చిన అనసూయ.. నవదీప్ తో మాట్లాడుతూ ట్రిప్ గురించి అడిగి తెలుసుకుంది. తనకు హిమాలయాల టూర్ అంటే చాలా ఇష్టమని అనసూయ చెప్పగానే.. నవదీప్ ”నేను మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్దాం అనుకుంటాను..

కానీ మీరు అక్కడకి రారు” అంటూ నవ్వుతూ పంచ్ వేశాడు. దీంతో షాకైన అనసూయ.. ‘వెళ్దాం.. వెళ్దాం’ అంటూ టాపిక్ డైవర్ట్ చేసేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక కెరీర్ విషయానికొస్తే.. అనసూయ ఓ పక్క టీవీ షోలు చేస్తూనే.. ‘రంగమార్తాండ’ అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇక నవదీప్ కూడా ఈ మధ్య బుల్లితెర షోలపై దృష్టి పెట్టాడు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus