Saindhav: ‘సైంధవ్’ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య!

  • January 27, 2023 / 11:26 AM IST

సినిమాల ఎంపిక విషయంలో వెంకటేష్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గతేడాది మేలో ఆయన నటించిన ‘ఎఫ్3’ సినిమా విడుదలైంది. ఆ తరువాత ఆయన మరో సినిమా ఒప్పుకోలేదు. ఫైనల్ గా వెంకీ నుంచి కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. అదే ‘సైంధవ్’. ‘హిట్’ ఫ్రాంచైజీ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీనికోసం భారీగా ఖర్చు చేయబోతున్నారు. కథ ప్రకారం.. సినిమాలో కొందరు పేరున్న నటీనటులను తీసుకోబోతున్నారు.

తమిళ హీరో ఆర్య ఈ సినిమాలో కీలకపాత్ర పోషించబోతున్నారని తెలుస్తోంది. అలానే బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీని కూడా కీలకపాత్ర కోసం ఎంపిక చేసుకున్నారట. సంతోష్ నారాయణన్ ను ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ గా అనౌన్స్ కూడా చేశారు. ఈ లెక్కన చూస్తుంటే సినిమాకి భారీగా ఖర్చు చేయాలని నిర్మాత ఫిక్స్ అయినట్లు ఉన్నారు. వెంకీ చాలా రోజులుగా సరైన కథ కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్ని కథలు విన్నా నచ్చలేదు.

అలాంటిది ‘హిట్2’ తరువాత శైలేష్ చెప్పిన కథ నచ్చి వెంటనే ఓకే చేశారు. పైగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉండడంతో సెట్స్ పైకి కూడా వెళ్లిపోతున్నారు. ఈ మధ్యకాలంలో వెంకీ చేస్తున్న భారీ సినిమా ఇదేనని చెప్పాలి. నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకీ కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. పోస్టర్ తోనే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగారు.

టైటిల్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక వెంకీ కెరీర్ విషయానికొస్తే.. త్వరలోనే ఆయన ఓటీటీలో ప్లాట్ ఫామ్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. తన అన్నయ్య కొడుకు రానాతో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేశారు వెంకీ. ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ‘రే డొనోవన్’కి రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus