Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

మొన్నీమధ్య వరకు జోష్‌లోనే నడిచిన ‘ధర్మన్‌’ సినిమా షూటింగ్‌ ఇప్పుడు డబుల్‌ జోష్‌ ఉంటుంది. ఎందుకంటే డబుల్‌ ‘జైలర్‌’ సాధించిన విజయం అలాంటిదే. దర్శకుడు అశ్వత్‌ మరిముత్తు మీద ఇప్పుడు మరింత బాధ్య పెరిగింది. ఎందుకంటే ‘జైలర్‌’ సినిమా తర్వాత రజనీకాంత్‌ చేసిన సినిమాలు ఆశించిన విజయం అందుకోలేదు. మళ్లీ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ వచ్చి ‘జైలర్‌ 2’ సినిమా తీస్తేనే విజయం సాధ్యమైంది. ఈ లెక్కన సంక్రాంతికి వస్తాడు అంటున్న ‘ధర్మన్‌’ మీద అంచనాలు, బరువులు భారీగానే ఉండనున్నాయి.

Nayanthara

సీరియస్‌ రిజల్ట్‌ టాక్స్‌ అయిపోయాయి కాబట్టి.. ఇప్పుడు గ్లామరస్‌ టాక్స్‌ గురించి మాట్లాడుకుందాం. అదే హీరోయిన్‌. ‘ధర్మన్‌’ సినిమాలోనూ రజనీకాంత్‌ తన వయసుకు తగ్గ పాత్రలోనే కనిపిస్తారు అని చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఓ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారు. ఆమెనే సీనియర్‌ హీరోయిన్‌ సిమ్రన్‌. రాశీ ఖన్నాను కూడా హీరోయిన్‌ లిస్ట్‌లోనే వేసినా.. ఆమె ఈ సినిమాలో రజనీకాంత్‌కి కుమార్తెగా నటిస్తోందని సమాచారం. అంతేకాదు మరో ముఖ్య పాత్రలో యువ కథానాయిక శ్రీలీల నటిస్తోందని కోడంబాక్కం వర్గాల సమాచారం.

ఇప్పుడు అదే కోడంబాక్కం వర్గాల నుండి మరో సమాచారం వచ్చింది. ‘చంద్రముఖి’, ‘దర్బార్‌’ సినిమాలో నటించి హిట్‌ జోడీ అనిపించుకున్న రజనీకాంత్, నయనతార ఇప్పుడు మరోసారి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ‘ధర్మన్‌’ సినిమా కోసం దర్శకుడు అశ్వత్‌ మరిముత్తు ఆమెను సంప్రదించారట. ఆమె పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో అధికారిక ప్రకటన ఉండొచ్చు అని చెబుతునర్నారు.

అయితే, ఈ సినిమాలో హీరో రామ్‌ కూడా నటిస్తున్నాడని వార్తలొచ్చినా.. చిత్రబృందం ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా ఏ విషయమూ చెప్పలేదు. ఆయన ఇప్పటికి రెండుసార్లు సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నాడు. కాబట్టి ఇప్పట్లో నయన్‌ విషయంలోనూ స్పష్టత రాదు అని చెప్పొచ్చు. సంక్రాంతికి సినిమా తీసుకొస్తారని టాక్‌ ఉన్న నేపథ్యంలో అప్పుడు అన్ని క్లారిటీలు వస్తాయి.

 మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus