Nayanthara, Vignesh Shivan: పెళ్లి పనులలో బిజీగా ఉన్నా నయనతార విగ్నేష్!

Advertisement

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న నయనతార గత కొంత కాలం నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే రహస్యంగా వివాహం చేసుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం వీరి పెళ్లి వచ్చే నెల 9వ తేదీ ఘనంగా జరగనుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ జంట పెళ్లి పనులను ప్రారంభించారని సమాచారం.

గత కొంత కాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట తిరుమల శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పెళ్లి పనుల్లో భాగంగా పెళ్లి పత్రికలు కూడా సిద్ధమయ్యాయని ఈ క్రమంలోనే వారి మొదటి శుభలేఖ నయనతార విగ్నేష్ కులదైవం సన్నిధిలో సమర్పించి ప్రత్యేక పూజలు చేయించినట్లు తెలుస్తోంది. పెళ్లి పనులలో భాగం ఈ జంట చెన్నై నుంచి తిరుచ్చికి విమానంలో వెళ్లి…

అక్కడి నుంచి తంజావూరు జిల్లా అయ్యంపేట వళుత్తియూరికి వెళ్లి అక్కడ ఉన్న కులదైవాన్ని దర్శించుకున్నట్లు తెలుస్తోంది.కులదైవం ఆలయంలో వీరిద్దరూ ప్రత్యేక పూజలను నిర్వహించి వీరి పెళ్లి మొదటి శుభలేఖను ఆలయంలో సమర్పించి పూజలు నిర్వహించారు.గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఎంతో ఘనంగా వివాహం చేసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి వివాహం జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

ఈ క్రమంలోనే జూన్ 9వ తేదీ ఈ ప్రేమ పక్షులు పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి పనులలో బిజీగా గడుపుతున్న నయనతార ఇప్పటివరకు ఇలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇకపోతే గతంలో ఈమె నటుడు శింబు, డైరెక్టర్ ప్రభుదేవాతో ప్రేమలో పడి, వారితో లవ్ బ్రేకప్ చెప్పుకున్న అనంతరం దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus