Nazriya: ఇంట్లో ఒక భర్తగా ఉంటే చాలు.. నటి నజ్రియా?

మలయాళీ బ్యూటీ నజ్రీయ నజీమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు తమిళ్ డబ్బింగ్ సినిమా “రాజా రాణి” సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఇటీవల నాని హీరోగా నటించిన ” అంటే సుందరానికి ” సినిమా ద్వారా హీరోయిన్ గా మొదటిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయితే ఊహించిన స్థాయిలో ఈ సినిమా హిట్ కాలేకపోయింది.

ఈ సినిమాలో నజ్రీయ నజీమ్ యాక్టింగ్ , ఎక్స్ప్రెషన్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. మలయాళంలో నజ్రియా నజీమ్ నటించిన బెంగుళూరు డేస్ సినిమా ద్వార ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో ఆమెతో కలిసి నటించిన ఫహద్ ఫాజిల్ తో నజ్రియాకు పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగామారింది. ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నజ్రీయ నజీమ్ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 25 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు పెళ్లి చేసుకోకూడదని అనుకున్నానని.. ఫహద్ నాజీవితంలోకి ఒక అద్భుతంలా వచ్చాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఫహద్ ఫాజిల్ గురించి మాట్లాడుతూ..ఆయన ఒక మెథడ్ యాక్టర్. ఒక పాత్ర చేస్తుంటే ఆ పాత్రలో లీనమైపోతాడని ఆమె చెప్పుకొచ్చారు. అయితే పెళ్లైన తర్వాత ఇంటికొచ్చాక ఒక భర్తగా ఉండాలంటే మెథడ్ యాక్టింగ్ మానుకొని ఇంటికొచ్చిన తర్వాత ఒక భర్తగా ఉంటే చాలు అంటూ వార్నింగ్ ఇచ్చానని నజ్రియా చెప్పుకొచ్చారు.

ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువ ఉన్నా కూడ వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా జీవితం సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక తెలుగులో నాని నటించిన జెర్సీ అంటే తనకు చాలా ఇష్టమని ఆమె తెలిపారు. నాని చేసిన సినిమాలు అన్నీ చాలా బాగుంటాయి. ఆయన స్టోరీ సెలక్షన్ చాలా బాగుంటుంది. అందుకే “అంటే సుందరానికి” సినిమాకి కూడా వెంటనే ఓకే చెప్పాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus