K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

దీపావళి సినిమాల సంగతి ఏమో కానీ… మొదటి నుండి వీటి చుట్టూ తిరుగుతున్న కాంట్రోవర్సీలు మాత్రం హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. ముందుగా వచ్చిన ‘మిత్రమండలి’ సినిమా విషయంలో నిర్మాత బన్నీ వాస్… కొంతమంది నిర్మాతలు తమ సినిమా ట్రైలర్ పై నెగిటివ్ కామెంట్స్ చెప్పించడం, ట్రోలింగ్ చేయించడం వంటివి చేస్తున్నారు అంటూ చెప్పి.. ‘అవి నా వెంట్రుకతో సమానం’ అంటూ కామెంట్ చేశారు.

K-RAMP

సినిమా కంటే బన్నీ వాస్ చేసిన ఈ కామెంట్సే ఎక్కువ హాట్ టాపిక్ అయ్యాయి. తర్వాత ‘తెలుసు కదా’ ప్రమోషన్స్ లో ఓ రిపోర్టర్ హీరో సిద్ధు జొన్నలగడ్డని ‘మీరు వుమెనైజరా?’ అంటూ ప్రశ్నించి షాక్ ఇచ్చింది. దానికి సిద్ధు బాగా హర్ట్ అయినట్లు తెలిపాడు. తర్వాత ‘డ్యూడ్’ ప్రమోషనల్ ఈవెంట్లో అదే రిపోర్టర్ హీరో ప్రదీప్ రంగనాథన్ ని ‘హీరో మెటీరియల్’ కాదు అంటూ విమర్శించింది.

ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం ‘K-RAMP’ సినిమాపై కొంతమంది పనిగట్టుకుని ట్రోల్ చేయిస్తున్నట్టు… హీరో టీం చెప్పుకొస్తోంది. అలాగే సోషల్ మీడియాలో ఉన్న అతని ఫాలోవర్స్ కూడా ‘K-RAMP’ ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.వాస్తవానికి దీపావళి పండుగని పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాల్లో ‘K-RAMP’కి ఎక్కువ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సెకండాఫ్ బాగా వచ్చిందని అంతా కొనియాడారు.

అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బెటర్ అయ్యాయి. అయితే మిగిలిన 3 సినిమాల్లోని ఒక సినిమాకు సంబంధించిన టీం ‘K-RAMP’ పై నెగిటివ్ ట్రెండ్స్ చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. తమ సినిమా దీపావళి విన్నర్ అంటూ పోస్టర్స్ కూడా వదిలినట్టు కిరణ్ అబ్బవరం టీం వాపోతుంది.

‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus