థియేటర్లలో ఫ్లాప్‌ మరి ఓటీటీల్లో ఏం చేస్తాడో?

  • October 11, 2022 / 04:42 PM IST

ఒకేసారి రెండు ఓటీటీల్లో సినిమాలు రిలీజ్‌ చేయడం, ఒక ఓటీటీలో వచ్చిన సినిమా కొద్ది రోజుల తర్వాత మరో ఓటీటీలో రావడం లాంటివి మనం ఇప్పటికే కొన్ని సినిమాల విషయంలో చూశాం. అయితే అవన్నీ పెద్ద హీరోల సినిమాలు. భారీ హిట్‌ కొట్టిన సినిమాలు. అయితే బాక్సాఫీసు దగ్గర ఇబ్బందికర ఫలితాన్ని అందుకున్న చిన్న హీరో సినిమా రెండు ఓటీటీల్లో విడుదల అవుతోంది అంటే ఆసక్తికర విషయమే కదా. ఆ హీరోనే కిరణ్‌ అబ్బవరం. ఆ సినిమానే ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’.

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ‘ఆహా’, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ నెల 14 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుందని చిత్రబృందం ప్రకటించింది. దర్శకుడు శ్రీధర్‌ గాదె తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబరు 16న థియేటర్లలో విడుదలైంది. రొమాంటిక్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో సంజనా ఆనంద్‌, సోనూ ఠాకూర్‌ కథానాయికలు. అయితే ఆశించిన మేర సినిమా విజయం అందుకోలేదు.

సినిమా కథ సంగతి చూస్తే.. తేజు (సంజ‌నా ఆనంద్‌) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఓ కుర్రాడిని ప్రేమించి.. అతడి చేతిలో మోస‌పోతుంది. దీంతో ఇంట్లో వాళ్ల‌కు ముఖం చూపించుకోలేక జీవితాన్ని భారంగా గ‌డిపేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే తాగుడుకి బానిస‌ అవుతుంది. ఆ సమయంలో ఆమె జీవితంలోకి క్యాబ్ డ్రైవ‌ర్‌ వివేక్ (కిర‌ణ్ అబ్బ‌వ‌రం) వస్తాడు. తేజు తాగి ప‌డిపోయిన ప్ర‌తిసారీ ఆమెను రూంలో డ్రాప్ చేస్తాడు. అలా ఓసారి ఆమెను ఓ గ్యాంగ్‌ కిడ్నాప్ చేయ‌బోతే కాపాడ‌తాడు.

దీంతో వివేక్‌పై ఆమె మంచి అభిప్రాయం ఏర్ప‌డుతుంది. దీంతో త‌న విషాద గాథ‌ను వివేక్‌కి చెబుతుంది. అదే స‌మ‌యంలో వివేక్ కూడా త‌న ఫెయిల్యూర్‌ లవ్‌స్టోరీని తేజుకి చెబుతాడు. ఆ త‌ర్వాత ఏమైంది? ఇద్ద‌రి ప్రేమ‌ క‌థ‌ల‌కు ఉన్న లింకేంటి? ఒక‌రి క‌థ మ‌రొక‌రు తెలుసుకున్నాక ఏం చేశారు అనేది సినిమా మిగతా కథ. ఆసక్తిగా అనిపిస్తే 14 వరకు వెయిట్‌ చేసి ఓటీటీల్లో చూసేయండి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus