Vignesh Shivan: నయనతార ఫ్రీ వెడ్డింగ్ ఫోటోలను షేర్ చేసిన నెట్ ఫ్లిక్స్!

లేడీ సూపర్ స్టార్ నయనతార విగ్నేష్ శివన్ గత ఏడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉండి గత నెల తొమ్మిదవ తేదీ వీరిద్దరూ పలువురు సినీ ప్రముఖులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరి వివాహానికి సంబంధించిన ఈ వేడుకను నెట్ ఫ్లిక్స్ ఏకంగా 25 కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకొని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వీరి వివాహ వేడుకను కూడా నెట్ ఫ్లిక్స్ సొంత డబ్బులతో ఎంతో ఘనంగా జరిపించారు.

ఇక వీరి వివాహ వేడుకను ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చిత్రీకరించారు. అయితే గత రెండు రోజుల నుంచి నయనతార దంపతుల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.నయనతార దంపతులు తమ పెళ్ళికి వచ్చిన పలువురు ప్రముఖుల సెలబ్రిటీల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల నెట్ ఫ్లిక్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీరి మధ్య కుదుర్చుకున్న డీల్ క్యాన్సిల్ చేసిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఈ విధంగా నెట్ ఫ్లిక్స్ తమ ఒప్పందం రద్దు చేసుకోవడంతో పెళ్లికి అయిన ఖర్చును మొత్తం నయనతార దంపతులు తిరిగి చెల్లించాలని వీరికి కోర్టు నుంచి నోటీసులు కూడా అందాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు నెట్ ఫ్లిక్స్ స్పందించి పూర్తిగా చెక్ పెట్టింది.నయనతార దంపతుల గురించి వస్తున్న ఈ వార్తలలో ఏ విధమైనటువంటి నిజం లేదని చెప్పకనే చెప్పేశారు. ఈ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ తమ అధికారక ఖాతా ద్వారా నయనతార విగ్నేష్ ప్రీ వెడ్డింగ్ ఫోటోలను షేర్ చేశారు.

సముద్ర తీరాన ఈ జంట వీరి ఫ్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకున్న ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవ్వడమే కాకుండా తమ గురించి వస్తున్న వార్తలకు పులిస్టాప్ పెట్టింది. ఇక ఈ ఫోటోలను షేర్ చేస్తూ త్వరలో ‘బియాండ్ ఫెయిరీ టేల్’ వీడియోను రిలీజ్ చేస్తామని నెట్ ఫ్లిక్స్ తెలిపింది. ఇలా నెట్ ఫ్లిక్స్ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus