నిహారికను ఓ రేంజ్లో తిట్టి పోస్తున్న నెటిజన్లు… కారణం అదే?

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇప్పుడు ట్రోలింగ్ కు గురయ్యింది. ఆమెను ఓ రేంజ్లో తిట్టి పోస్తున్నారు నెటిజన్లు. దానికి ప్రధాన కారణం ఇటీవల ఆమె చైనా ఫోన్ ను ప్రమోట్ చెయ్యడమే అని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల నిహారిక ‘వన్ ప్లస్’ అనే చైనా మొబైల్ ను ప్రమోట్ చేస్తూ.. తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. ఓ పక్క జనాలందరూ చైనా ప్రోడక్ట్స్ ను బ్యాన్ చెయ్యాలి అంటూ నిరసనకు దిగుతున్నారు.. మరోపక్క ప్రభుత్వం కూడా పలు చైనా యాప్స్ ను, వస్తువులను బ్యాన్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తుంది.

ఇప్పటికే పలు సోషల్ మీడియా యాప్ లను కూడా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో నిహారిక ఇలా చైనా మొబైల్ ను ప్రమోట్ చేస్తుండడంతో నెటిజన్లు మండిపడుతున్నట్టు స్పష్టమవుతుంది. ‘నీకు కనీసం బాధ్యత లేదా? నీకు దేశభక్తి లేదా? అంటూ నిహారిక పై ఓరేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అయితే నిహారిక మాత్రం ఈ ట్రోలింగ్ కు స్పందించడంలేదు. బహుశా ఆమె ఎంగేజ్మెంట్ పనుల్లో బిజీగా ఉండడం వల్ల స్పందించడం లేదేమో అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే..

మరికొంత మంది భయపడి స్పందించడం లేదు అనుకుంటున్నారు. అయితే వాస్తవానికి ‘వన్ ప్లస్’ మొబైల్ ను ప్రమోట్ చెయ్యడానికి నిహారిక 6 నెలలు క్రితమే అగ్రిమెంట్ పై సైన్ చేసిందట. అప్పుడు ఇలాంటి వికృత పరిస్థితులు ఏర్పడలేదు. కాబట్టి ఆల్రెడీ కమిట్ అయిన దానికి నో చెప్పడం ఇష్టపడలేక.. ఆ మొబైల్ ను ప్రమోట్ చేసినట్టు తెలుస్తుంది.


Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus