Nivetha Thomas: కరోనాతో సినిమా థియేటర్ కి వెళ్లిన హీరోయిన్!

  • April 11, 2021 / 04:17 PM IST

కరోనా పాజిటివ్ వస్తే వెంటనే ఐసోలేషన్ లో ఉంటారు. పరిస్థితి సీరియస్ అయితే హాస్పిటల్ లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటారు. కానీ హీరోయిన్ నివేదా థామస్ మాత్రం కరోనా పాజిటివ్ తో థియేటర్ కి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో నివేదా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ముందు ఏప్రిల్ 3న ఈమెకి కరోనా సోకినట్లు.. ఐసోలేషన్ లో ఉన్నట్లు అభిమానులకు వెల్లడించింది. తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరింది.

‘వకీల్ సాబ్’ రిలీజ్ కు ముందు రోజు అందరూ మాస్క్ లు వేసుకొని థియేటర్ లో సినిమా చూడాలని కోరింది. ఇలా ప్రేక్షకులకు జాగ్రత్తలు చెప్పిన నివేదా.. తనకు కరోనా సోకిన వారం రోజులకే థియేటర్ లో కనిపించింది. ప్రేక్షకులంతా ‘వకీల్ సాబ్’ సినిమాను చూస్తుండగా.. వారి వెనుక నుంచొని ”ఈ మూమెంట్ కోసమే జీవిస్తున్నా” అంటూ క్యాప్షన్ పెట్టి ఫోటో షేర్ చేసింది. నివేదాకు కరోనా తగ్గిందా..? లేదా..? అనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అంతలోనే ఇలా సినిమా థియేటర్ లో ప్రత్యక్షమైంది. ఆమె ప్రేక్షకుల మధ్య కూర్చోలేదు.

కాస్త దూరంగానే ఉంది. కానీ కరోనా పాజిటివ్ పెట్టుకొని ఇలా బయటకి రావడంపై నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. బాధ్యతగా ఉండాల్సిన సెలబ్రిటీలు ఇలా ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. నిజానికి నివేదాకు తను నటించే ప్రతీ సినిమా ఇలా ప్రేక్షకులతో పాటు థియేటర్ లో చూడడం అలవాటు. అందుకే ‘వకీల్ సాబ్’ విషయంలో కూడా ఇలానే చేసింది. కానీ ఆమె కోవిడ్ పెట్టుకొని వందల మంది ఉండే థియేటర్ కు రావడాన్ని అందరూ తప్పుబడుతున్నారు.


Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus