Kiran Abbavaram: సమ్మతమే హీరోకు నెటిజన్లు అలా షాకిచ్చారా?

కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా గోపీనాథ్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన సమ్మతమే సినిమా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. సెబాస్టియన్ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో కిరణ్ అబ్బవరం ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం ఇన్ స్టాగ్రామ్ లో ఎవరైనా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల చూడలేకపోతే టికెట్లు బుకింగ్ చేస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు.

100 నుంచి 1000 మంది టికెట్లు అడుగుతారని కిరణ్ అబ్బవరం భావించగా ఈ హీరో పోస్ట్ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 26,500 మంది ఇన్ స్టాగ్రామ్ లో టికెట్లు కావాలని కామెంట్లు చేశారు. కొంతమంది నెటిజన్లు ఏకంగా 5 టికెట్లు కావాలని కామెంట్ చేయడం గమనార్హం. అయితే ఈ స్థాయి రెస్పాన్స్ కు షాకైన కిరణ్ అబ్బవరం తనకు వీలైనంత మందికి టికెట్లను పంపే ప్రయత్నం చేశారు.

కిరణ్ అబ్బవరం మరో వీడియోలో అడిగిన ప్రేక్షకులందరికీ టికెట్లు బుక్ చేయాలంటే ఫోన్, ఫోన్ పేలో డబ్బులు సరిపోవని ఆస్తులు అమ్ముకోవాలని చెప్పుకొచ్చారు. ఒకడు అయితే 200 అతనికి 200 గర్ల్ ఫ్రెండ్ కు పెట్రోల్ కు 100 రూపాయలు అడిగాడని కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశారు. సగం అకౌంట్లు ఫేక్ అకౌంట్లు కావడంతో షాకవ్వడం సమ్మతమే హీరో వంతైంది. సమ్మతమే సినిమాకు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ వచ్చింది.

గీతా ఆర్ట్స్ సపోర్ట్ చేయడంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లు దక్కాయి. బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. యూత్ ను టార్గెట్ చేసి ఈ సినిమాను తెరకెక్కించగా యువతకు ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus