స్టార్ హీరోయిన్ సమంత డివోర్స్ నేపథ్యంలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో నటుడు సిద్దార్థ్ సోషల్ మీడియాలో మోసం చేసిన వారు ఎప్పుడూ కూడా బాగు పడరని ట్వీట్ చేశారు. సిద్దార్థ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే చైతన్య, సమంత విడాకుల వార్త వల్ల హర్ట్ అయిన వాళ్లు సిద్దార్థ్ చేసిన ట్వీట్ గురించి మండిపడుతున్నారు. కొంతమంది బుద్ధి లేకుండా సిద్దార్థ్ ఈ సమయంలో ట్వీట్స్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తుండగా నెటిజన్లలో ఎక్కువమంది సిద్దార్థ్ ట్వీట్ ను వ్యతిరేకిస్తుండటం గమనార్హం.
మరోవైపు సిద్దార్థ్ కు కూడా ఒక గతం ఉందని సమంతను సిద్దార్థ్ నిందించాలని అనుకుంటే సిద్దార్థ్ మాజీ భార్య గురించి కూడా చర్చకు రావాల్సిందేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సమంతను నిందించే అర్హత సిద్దార్థ్ కు లేదని ఆ విషయం అతనికి కూడా తెలుసని నెటిజన్లు భావిస్తున్నారు. జబర్దస్త్ సినిమా షూటింగ్ సమయంలో సిద్దార్థ్ సమంత మధ్య ప్రేమ పుట్టిందని వార్తలు వచ్చాయి. ఆ తరువాత శ్రీకాళహస్తిలో సిద్దార్థ్ సమంత పూజలు చేసినట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే ఆ తర్వాత కాలంలో వేర్వేరు కారణాల వల్ల వాళ్లిద్దరూ విడిపోయారు. చైసామ్ అభిమానులు ఫీలవుతున్న సమయంలో సిద్దార్థ్ వివాదాస్పద ట్వీట్లకు దూరంగా ఉంటే మంచిదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సిద్దార్థ్ ఇష్టానుసారం ట్వీట్లు చేయకుండా జాగ్రత్త పడతారేమో చూడాల్సి ఉంది.