Gopichand: పోటీ లేకపోయినా గోపీచంద్ సత్తా చాటలేకపోయారా?

  • July 5, 2022 / 07:31 PM IST

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన గోపీచంద్ లౌక్యం సినిమాలో నటించగా ఆ సినిమా తర్వాత గోపీచంద్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. పక్కా కమర్షియల్ సినిమాతో గోపీచంద్ భారీ సక్సెస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావించగా ఫుల్ రన్ లో ఈ సినిమా సాధించే కలెక్షన్లను బట్టి ఈ సినిమా ఫలితం డిసైడ్ కానుంది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

కథ, కథనం ఎంపికలో గోపీచంద్ తప్పటడుగులు వేస్తున్నాడని ఫలితంగా గోపీచంద్ కెరీర్ ఆశించిన స్థాయిలో పుంజుకోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చాలామంది మిడిల్ రేంజ్ హీరోలు సినిమాల ద్వారా 40 కోట్ల రూపాయల నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుండగా గోపీచంద్ సినిమాలకు 20 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రావడం కష్టమవుతోంది. గోపీచంద్ తర్వాత సినిమాలు కూడా సక్సెస్ సాధించకపోతే ఈ హీరోకు కొత్త ఆఫర్లు రావడం కూడా కష్టమవుతుంది.

ఒక్కో సినిమాకు 3 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో గోపీచంద్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కెరీర్ తొలినాళ్లలో హీరో రోల్స్ తో, విలన్ రోల్స్ తో వరుస విజయాలను సొంతం చేసుకున్న గోపీచంద్ ఇప్పుడు మాత్రం వరుస విజయాలను అందుకోవడంలో ఫెయిలవుతున్నారు. చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోలు వరుస విజయాలతో ప్రస్తుతం కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ కూడా ఆ హీరోలలా కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మాస్ ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గోపీచంద్ క్రమంగా మార్కెట్ ను కోల్పోతున్నారు. గోపీచంద్ సైతం కెరీర్ విషయంలో జాగ్రత్త వహిస్తూ ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus