అభిమానం పేరుతో ఉన్మాదం చూపించే వారిని అభిమానులు అంటారా? అంటే కచ్చితంగా కాదు అనే చెప్పాలి. గతంలో చాలాసార్లు చర్చకు వచ్చిన ఈ అంశం మరోసారి టాక్ ఆఫ్‌ది సౌత్‌గా మారింది. దీనికి కారణం థళపతి విజయ్ వికీపీడియా పేజీలో ఇబ్బందికర మార్పులు జరగడమే. వికీపీడియా సమాచారంలో ఎవరైనా మార్పులు చేయొచ్చనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది విజయ్ ప్రొఫైల్‌లో వైవాహిక జీవితం గురించి ఇబ్బందికరంగా మార్పులు చేశారు.
దీంతో ఇప్పుడు ఈ విషయంలో సోషల్ మీడియాలో, తమిళనాట వైరల్ అవుతోంది. ఇటీవల విజయ్ వికీపీడియాలో పేజీలో కొన్ని మార్పులు కనిపించాయి. ‘‘విజయ్ తన భార్య సంగీతకు దూరంగా ఉంటున్నారని, ఓ హీరోయిన్ లివింగ్ రిలేషన్లో ఉన్నారని వికీపీడియాలో రాశారు. ఓ గంటపాటు ఆ విషయంలో వెబ్సైట్లో కనిపించింది. విషయాన్ని పసిగట్టిన టీమ్ వెంటనే మార్పులు చేసింది. అయితే ఈ మార్పుల విషయంలో విజయ్ ఫ్యాన్స్ ఏ మాత్రం హ్యాపీగా లేరు.
ఇలాంటి పనులు చేసేది ఎవరో తమకు తెలుసు అంటూ గుర్రుగా ఉన్నారు. విజయ్‌కి 1999లో పెళ్లి జరిగింది. 23 ఏళ్ల వైవాహిక బంధంలో ఆయనకు ఇద్దరు పిల్లలు. కొడుకు జాసన్ విజయ్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తాడని టాక్. ఈ సమయంలో విజయ్ వైవాహిక జీవితం విషయంలో ఇలా పుకార్లు రావడం గమనార్హం. అయితే అలాంటి పుకార్లను కొంతమంది నమ్మడానికీ ఓ కారణం ఉంది. ఏటా క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను విజయ్ తన ఫ్యామిలీతో విదేశాల్లో జరుపుకుంటారు.
అయితే ‘వరిసు’ పనుల మీద విజయ్ ఈ సారి వెళ్లలేదు. దీంతో పిల్లలతో కలసి సంగీత మాత్రమే వెళ్లారు. దీంతో విజయ్ – సంగీత దూరంగా ఉంటున్నారు అంటూ కొంతమంది సోషల్ మీడియా ఉన్మాదులు ఇలా రాశారు అని అర్థమవుతోంది. అయితే కోలీవుడ్‌లో విజయ్ వర్సెస్ అజిత్ చాలా ఏళ్లుగా నడుస్తోంది. అయితే అది అభిమానుల మధ్యనే అనేది మనం గుర్తుంచుకోవాలి.